
Ravi Teja's Irumudi faces questions over its title and its connection to Ayyappa devotees.
నిన్న విడుదలైన “ఇరుముడి” ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గత కొంతకాలంలో రవితేజ సినిమాల విషయంలో కనిపించని పాజిటివ్ వైబ్ ఈ సినిమాలో కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్ లోని ఎమోషన్ అనేది బాగా వర్కవుట్ అయ్యింది. ట్రైలర్ రేంజ్ లో సినిమా ఉందంటే.. కచ్చితంగా హిట్టే.
అయితే.. నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శివ నిర్వాణ “ఇరుముడి” అనే టైటిల్ కి ఇచ్చిన జస్టిఫికేషన్ మాత్రం లేనిపోని సందేహాల్ని లేవనెత్తింది. “ఇరుముడి అంటే తండ్రీకూతుళ్ల మధ్య ఒక ముడి, అయ్యప్ప-భక్తుడి మధ్య ఒక ముడి, ఒక క్రైమ్ చిక్కుముడి, అసలిది భక్తి సినిమానే కాదు” అంటూ శివ నిర్వాణ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇరుముడి విశిష్టత అనేది కనిపించలేదు.
దాంతో కొంతమంది అయ్యప్ప భక్తులు.. అలాంటప్పుడు త్రిముడి అని టైటిల్ పెట్టుకోవాలి కానీ, ఇరుముడి ఏంటి? అనే ప్రశ్నిస్తున్నారు. ఈమధ్యకాలంలో సెన్సార్ బోర్డ్ కూడా దేవుళ్ల టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. “హే భగవాన్, సరస్వతి, కామాఖ్య” వంటి సినిమాల టైటిల్స్ అన్నీ సెన్సార్ షిప్ తర్వాత మార్చాల్సి వచ్చింది.
మరి ఇప్పుడు “ఇరుముడి” కూడా సెన్సార్ తర్వాత లేదా భక్తుల నుండి వచ్చే రెస్పాన్స్ తర్వాత టైటిల్ మార్చుకుంటుందా? లేక అదే టైటిల్ ని థియేటర్ల వరకు తీసుకురాగలుగుతుందా? అనేది చూడాలి. ఒకవేళ థియేటర్లకి వచ్చిన తర్వాత టైటిల్ జస్టిఫికేషన్ ను స్వామి భక్తులు యాక్సెప్ట్ చేస్తారా? అనేది కూడా పెద్ద ప్రశ్న.
Aditi Budhathoki turns golden hour into her personal fashion spotlight with a white lace dress…
Don 3 was in the headlines a few months ago after Ranveer Singh left the…