Telugu

కూటమి ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టిందా లేదా?

ఇదివరకు కరోనా, లాక్ డౌన్‌లోడ్‌, ప్రకృతి విపత్తులు వంటివి దేశంలో అన్నీ రాష్ట్రాలకు చక్కటి గుణాపాఠాలు నేర్పాయి. అప్పటి నుంచి అత్యవసర సమయాలకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నాయి.

ఇప్పుడు భారత్‌-పాక్‌ యుద్ధం మరో కొత్త గుణపాఠం నేర్పిస్తోంది. ఈ యుద్ధం ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది? దీంతో దేశం ఏ మేరకు ప్రభావితమవుతుంది?యుద్ధ పర్యవసానాలు ఏవిదంగా ఉండబోతున్నాయి?వంటి అనేక ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానాలు లభిస్తాయి.

ADVERTISEMENT

అయితే ఇటువంటి సందర్భాలలో అందరి కంటే ముందుగా స్పందించే సిఎం చంద్రబాబు నాయుడు, రోజూవారి కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతుండటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌కి సువిశాలమైన సముద్ర తీరం ఉంది. ఇప్పటి వరకు పర్యాటక ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్న ఈ సముద్ర తీరమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ వరకు యుద్ధం విస్తరించేందుకు దోహదపడవచ్చు.

గతంలో పాకిస్థాన్‌ నావికా దళానికి చెందిన సబ్ మెరైన్ విశాఖ మీద మెరుపు దాడి చేసేందుకు వచ్చి ఎదురుదెబ్బ తింది. కనుక ఇప్పుడూ పాక్‌ సముద్ర మార్గంలో విశాఖ తదితర ప్రాంతాలకు చేరుకొని దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని భావించవచ్చు.

భారత్‌ వాయుసేన, ఈస్ట్రన్ నావల్ కమాండ్ రెండూ ఏపీలో సముద్ర తీరానికి రక్షణగా ఉన్నాయి. అయినప్పటికీ ఒకవేళ పాక్‌ విశాఖతో సహా ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలపై దాడులు చేస్తే, తక్షణమే సహాయ చర్యలు చేపట్టేందుకు అవసరమైన యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, మందులు వగైరా అన్నీ సిద్దంగా ఉన్నాయా?

భారత్‌పై అణుబాంబు ప్రయోగిస్తామని పాక్‌ పాలకులు పదేపదే బెదిరిస్తునందున, నిజంగా అటువంటి దాడి జరిగితే, అటువంటి అత్యవసర పరిస్థితిలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అవసరమైన చికిత్స అందించేందుకు కూటమి ప్రభుత్వం ఏమైనా ఏర్పాట్లు చేస్తోందా లేదా? అని సామాన్య ప్రజల ప్రశ్న!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

21 minutes ago

GV Prakash’s Big Bollywood Test

GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…

50 minutes ago