
నిప్పు లేనిదే పొగ రాదన్న చందంగా అత్యంత వేగంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఈ వార్తకు నిర్మాత వంశీ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం, ఈ వాయిదా వార్తలను మరింత బలపరుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా “భీమ్లా నాయక్” సినిమా వాయిదాల గురించి రకరకాల వార్తలు వెలువడ్డాయి.
ముఖ్యంగా సంక్రాంతి సమయంలో ‘ఆర్ఆర్ఆర్’కు పోటీగా ‘భీమ్లా’ విడుదల తధ్యం అన్న తరుణంలో వచ్చిన వాయిదా వార్తలను నిర్మాత వంశీ సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ, ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల అవుతుందని కొత్త పోస్టర్ లను రిలీజ్ చేసి మరీ చెప్పేవారు.
కానీ ప్రస్తుత వాయిదా వార్తలపై వంశీ ఏ మాత్రం స్పందించకపోవడంతో, ‘భీమ్లా’ వాయిదా అనివార్యం అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 25వ తేదీ తప్పిస్తే, ఏప్రిల్ 1వ తేదీకే పవన్ సినిమా విడుదల ఉండొచ్చు. అంటే మరో నెల పదిహేను రోజుల పాటు అభిమానులు నిరీక్షించాల్సిందే.
ఇదిలా ఉంటే ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ ను ఇవ్వడంతో యుఎస్ లో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయిపోయాయి. కొన్ని ధియేటర్లు ఇప్పటికే టికెట్లను మంజూరు చేయడం జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో కూడా ఇలాగే ఓ సారి జరిగిన విషయం తెలిసిందే.
అడ్వాన్స్ టికెట్లు ఇచ్చిన తర్వాత ఇలా పెద్ద సినిమాలు వాయిదాలు వేయడం అనేది మార్కెట్ పరంగా ఏ మాత్రం శుభసూచకం కాదు. ఇలానే జరిగితే అడ్వాన్స్ బుకింగ్స్ కు ప్రేక్షకుల ప్రాధాన్యత తగ్గిపోతుందని నిర్మాతలు కూడా గమనించుకోవాలి.
అన్నీ ఆలోచించుకున్న తర్వాతే రిలీజ్ డేట్ ఇచ్చి, దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి గానీ, ఇలా అభిమానుల మనోభావాలతో ఆటలు ఆడుకుంటే, తదుపరి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. బహుశా ఈ రిలీజ్ డేట్ మార్పు అనేది ఏపీ టికెట్ ధరల విషయంలోనా? లేక హిందీ రిలీజ్ వలన? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
ఉన్నట్లుండి ‘భీమ్లా నాయక్’ హిందీలో కూడా రిలీజ్ అవుతుందని ఇటీవల నిర్మాత వంశీ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే దానికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ జరిగిందా? లేదా? అన్నది మాత్రం తెలియజేయలేదు. బహుశా దాని వలన తెలుగు రిలీజ్ ను ఆపడం అనేది అయితే మంచి నిర్ణయం కాదేమో!?
After a long wait of seven years, the Student of the Year franchise is finally…
Megastar Chiranjeevi’s next release is Kaaka, directed by Bobby Kolli. The film marks the Telugu…