
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏదైనా దేశంపైకి దండయాత్ర చేయాలన్నా లేదా ఏదైనా దేశాన్ని లొంగదీసుకోవాలన్నా వాటి చెయ్యి ఎలా మెలిపెడతారో అందరూ చూస్తూనే ఉన్నారు. బిజేపి (కేంద్ర ప్రభుత్వం) కూడా తమిళనాడు రాజకీయాలలో ప్రవేశిస్తున్న విజయ్ దళపతిని తమతో పొత్తులు పెట్టుకోవాలని ఇదేవిధంగా ఒత్తిడి చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయన చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదల కాకుండా అడ్డుకుంటోందని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే తాను ఎవరి ఒత్తిళ్ళకు తలొగ్గే ప్రసక్తే లేదని, ఏప్రిల్-మే మద్య జరిగే తమిళనాడు శాసనసభ ఎన్నికలలో టివికే పార్టీ ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తుందని విజయ్ నేడు పునరుద్ఘాటించారు.
ఈసారి జరుగబోయేది కేవలం రాజకీయ పార్టీల మద్య జరిగే ఎన్నికల పోరు కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు జరుగబోయే యుద్ధం. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే రెండు పార్టీలు ఎప్పుడో బిజేపికి (కేంద్రానికి) లొంగిపోయి అది చెప్పినట్లు ఆడుతున్నాయి. కానీ టివికే పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితిలో బిజేపికి తల వంచదు,” అని మహాబలిపురంలో జరిగిన పార్టీ సభలో విజయ్ స్పష్టం చేశారు.
ఈ గుసగుసలు, ఊహాగానాల సంగతి పక్కనపెట్టి, విజయ్ చెప్పిన ఈ మాటలు వింటే ఆయనపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని అర్ధమవుతోంది. దీని ద్వారా కొన్ని విషయాలు స్పష్టమవుతున్నాయి.
1. తమిళనాడు రాజకీయాలను ఆయన శాశించగలరని బిజేపి అంగీకరిస్తున్నట్లే భావించవచ్చు.
2. కానీ ఆయన సినిమాని అడ్డుకోవడం ద్వారా తమిళ ప్రజలలో బిజేపి పట్ల వ్యతిరేకత పెంచుకుంటోందనే సంగతి గ్రహించినట్లు లేదు.
3. టివికే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే అదే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇదివరకు కమల్ హాసన్ కూడా ఇలాగే ఎదురుదెబ్బ తిన్నారు. తర్వాత బిజేపితో చేతులు కలిపారు.
4. ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. కనుక ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం విజయ్‌కి ఎన్ని అవరోధాలు సృష్టిస్తే ప్రజలలో అయన పట్ల అంత సానుభూతి, బిజేపి పట్ల వ్యతిరేకత పెరుగుతాయి. అప్పుడు ఆయన విజయావకాశాలు కూడా పెరుగుతాయని బిజేపి పెద్దలు గ్రహించడం చాలా అవసరం.
5. కనుక టివికేతో పొత్తుకి బిజేపి ఆరాటపడటం కంటే ఇప్పటికే పొత్తులో ఉన్నా అన్నాడీఎంకే బలోపేతం అయ్యేందుకు పూర్తి మద్దతు ఇస్తే బిజేపికి ఎంతో కొంత లబ్ది కలిగేది.
Aadarsha Kutumbam was supposed to hit theatres on October 9, but it was postponed as…
Senior actress Indraja has openly slammed the trend of holding success meets for films that…