
తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్ధులు చాలా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ ఉద్యమాలలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు ఎంత కీలక పాత్ర పోషించారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో రాష్ట్రంలో విద్యార్ధులందరూ బీఆర్ఎస్ పార్టీతో మమేకం అవడంతో ఉద్యమాలు ఊపందుకున్నాయి.
కానీ తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్ధులను దూరం పెట్టారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులను శత్రువులుగా చూసేవారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో విద్యార్ధుల ఆందోళనలు పట్టించుకోలేదు. ఇది 2023 శాసనసభ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపబోతోందని చివరి నిమిషంలో గ్రహించిన మాజీ మంత్రి కేసీఆర్, హైదరాబాద్‌లో హాస్టల్ విద్యార్ధుల వద్దకు వెళ్ళి మాట్లాడిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.
కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కనీసం బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత అయినా మళ్ళీ విద్యార్ధులకు చేరువయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నింఛి ఉండి ఉంటే నేడు వారందరూ పార్టీకి అండగా ఉండేవారు.
బీఆర్ఎస్ పార్టీ అత్యంత బలహీనంగా మారిన తర్వాత ఇప్పుడు విద్యార్ధులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ పునరుజ్జీవం కొరకు వారి సాయం కోరుతున్నారే తప్ప వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడగడం లేదు.
నిన్న కేటీఆర్, హరీష్ రావు తదితర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు పార్టీలో విద్యార్ధి విభాగంతో సమావేశాలు నిర్వహించి, ఏపీ ప్రభుత్వం నిర్మించబోతున్న బనకచర్ల ప్రాజెక్టు వలన తెలంగాణకు ఏవిదంగా నష్టం జరుగుతుందో వివరించి, దీనిని అడ్డుకోవాలంటే విద్యార్ధులు పూనుకొని తెలంగాణ ప్రజలను చైతన్య పరచాలని కోరారు.
ఓ పక్క చంద్రబాబు నాయుడు, మరోపక్క కాంగ్రెస్, బీజేపిలు కలిసి తెలంగాణపై ముప్పేట దాడి చేస్తూ కేసీఆర్ పేరుని తుడిచిపెట్టేసి తెలంగాణని కబళించాలని కుట్రలు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. కనుక తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవాలంటే విద్యార్ధులు మళ్ళీ రంగంలో దిగాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయని, వాటి వలన వచ్చే ఎన్నికలలో నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని కేటీఆర్ బాగానే గ్రహించినట్లున్నారు.
కనుక బీఆర్ఎస్ పార్టీ పునరుజ్జీవం కొరకు ‘బనకచర్ల ప్రాజెక్టు’ పేరుతో ‘తెలంగాణ సెంటిమెంట్’రగిలించాలని ప్రయత్నిస్తున్నారని అర్ధమవుతూనే ఉంది.
కేసీఆర్ అస్తిత్వమే తెలంగాణ అస్తిత్వమని విద్యార్ధులకు బ్రెయిన్ వాష్ బాగానే చేస్తున్నారు. తెలంగాణని కాపాడుకోమని పిలుపునిస్తే తప్పు కాదు కానీ కేసీఆర్‌ని అంటే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి పోరాటాలు మొదలుపెట్టమని కోరుతున్నారు!
అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ, టీపీపీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్ అవడం, తదనంతర పరిణామాల వలన లక్షలాది మంది విద్యార్ధులు నష్టపోతే చాలా తేలికగా మాట్లాడిన కేటీఆర్, ఇప్పుడు ఆ విద్యార్ధుల సాయమే కోరుతున్నారు.
అదీ…. ఇంకా కనిపించని బనకచర్ల ప్రాజెక్టు పేరుతో పోరాటాలు చేయాలని తప్పు దోవ పట్టిస్తున్నారు. కనుక తాము బీఆర్ఎస్ పార్టీని కాపాడేందుకు పోరాడాలా వద్దా… అని ఆలోచించుకోవలసింది తెలంగాణ విద్యార్ధులే.
https://twitter.com/BRSparty/status/1949106425852231823?ref_src=twsrc%5Etfw
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…