
కుల పెద్దలుగా చెప్పుకునే కొందరు కాపు సామాజికవర్గ నేతలు, కుల నాయకులుగా గుర్తింపు పొంది కుల రాజకీయాలు నడిపే మరి కొందరు కాపు నాయకులు కలిసి పవన్ దశాబ్దాల రాజకీయ కష్టాన్ని ‘కులం’ అనే పద్మవ్యూహంలో బంధించాలని భావిస్తున్నారా.? లేదా ‘కుల రాజకీయాలు’ అనే అస్త్రాలతో కూల్చాలని చూస్తున్నారా.?
తాజాగా కాపు కులపెద్దలుగా చెప్పుకునే నేతలను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఆవేదనను, అసహనాన్ని బయటపెట్టాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటుగా పొరుగు రాష్ట్ర రాజకీయాలను, అక్కడి రాజకీయ పార్టీలను, పార్టీల అధినేతలను గమనిస్తే ఈ కుల రాజకీయ సమస్య ఒక్క జనసేననే ఎందుకు వెంటాడి వేధిస్తుంది.
నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ కి లేని కుల సమస్య, నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ముందు నిలవని సమస్య పవన్ ను ఎందుకింతలా వెంటాడుతుంది.? వైఎస్ఆర్ మరణం తరువాత పుట్టుకొచ్చిన వైసీపీ లో కనిపించని సమస్య, జగన్ కు ఎదురుపడని కుల సమస్య పదేపదే పవన్ ముందుకెందుకొస్తుంది.?
అటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అడ్డంకి గా కానీ సమస్య, బిఆర్ఎస్ ను రాజకీయంగా వెనక్కిలాగని కుల సమస్య జనసేనను ఎందుకు వేధిస్తుంది.? తెలంగాణ రాజకీయాలలో ఎవ్వరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకున్న రేవంత్ కు తెలియని సమస్య పవన్ ను ఎందుకంతలా బాధిస్తుంది.?
కాపు కులం నుంచి వచ్చి పార్టీ పెట్టి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నువ్వు కాపు కులానికి ఎం చేసావ్.? చేస్తున్నావ్.?అసలు కాపు కులమంతా నీకు ఎందుకు కాపు కాయాలి.? నీ జనసేన పార్టీకి రాజకీయంగా ఎందుకు మద్దతు తెలపాలి.? అంటూ కొందరు కాపు మేధావులు పవన్ ను వెంటాడుతున్నారు, రాజకీయంగా వెనక్కిలాగాలని చూస్తున్నారు.
అసలు నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా.? నిన్ను, నీ పార్టీని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా.? కమ్మవారికి ఊడిగం చెయ్యడానికేనా జనసేన ఏర్పాటు అంటూ మరికొందరు కాపు పెద్దలు జనసేన ఉసురు తియ్యాలని శపధాలు చేసారు, పంతాలు పడుతున్నారు. ఎందుకు వీరందరికి పవన్ అంటే అంత కక్ష్య.? జనసేన అంటే అంత అసూయ.?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి అధికారికంగా ఆ పార్టీ పేరు కూడా చెప్పుకోలేని శ్రీ రెడ్డి వరకు పవన్ నుంచి ఆయన కుటుంబం వరకు అందరి పై నీచాతి నీచమైన విమర్శలు చేసారు. ఇక 2019 లో జనసేన ఓటమితో వైసీపీ, పవన్ ను రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి దారుణంగా అవమానించి, అవహేళన చేసింది.
మరి అటువంటి సమయంలో పవన్ కు అండగా లేని ఈ సోకాల్డ్ కాపు నేతలు, జనసేన భుజం కాయని ఆ నాయకులు ఇప్పుడొచ్చి జనసేన రాజకీయం ఎలా ఉండాలి.? ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి.? ఎవరిని పక్కన కూర్చోబెట్టుకోవాలి.? ఎవరికి రాజ్యసభ సీట్లు ఇవ్వాలి అంటూ ఆదేశాలిస్తూ, ఆంక్షలు పెట్టడం పవన్ ను రాజకీయాయంగా రెచ్చకొట్టడం కాదా.?
పుష్కర కాలం నాటి జనసేన రాజకీయ కష్టానికి కాపు కాయాల్సిన వారే ఇలా తమ మాటలతో పార్టీని కాటేస్తుంటే ఎలా.? వైసీపీ లాంటి బలమైన పార్టీని రాజకీయంగా ఎదిరించి, టీడీపీ వంటి రాజకీయ బలమున్న పార్టీతో పొత్తు పెట్టుకుని, మోడీ వంటి ఛరిష్మా ఉన్న నేతను మెప్పించిన పవన్ కు రాజకీయ కంచెగా నిలబడాల్సిన వారే ఇప్పుడు ముల్లుగా మారి గుచ్చేస్తే ఎలా.?
సామాజికవర్గం పరంగా అండగా నిలబడాల్సిన వారే అడ్డు గోడలు నిర్మిస్తున్నారా.? కుల పెద్దలుగా కడుపులో పెట్టుకుని కాపు కాయాల్సిన వారే కులం పేరుతో బెదిరింపులకు దిగుతున్నారా.? పేర్లు మార్చుకోవడానికి కూడా వెనుకాడని వారు సామాజికవర్గ పేరు నిలబెట్టడానికి ముందడుగు వేయలేకపోతున్నారా.?
కులం అనే పద్మవ్యూహంలో పవన్ ను బంధించాలని చూస్తున్నారా.? బెదిరింపులు అనే బాణాలతో జనసేనను గాయపెట్టాలని భావిస్తున్నారా.? వేరెవరినో అందళం ఎక్కించడానికి, పవన్ ఎక్కిన అందలాన్ని పడగొట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారా.? ఎప్పుడో మరణించిన వారి పేరు చెప్పుకుంటూ ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతున్న వారిని చంపేస్తారా.?
ఇదేనా వారు కాపు సామాజికవర్గ ఎదుగుదల కోసం చేసే త్యాగాలు.? సాయాలు.? రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజికవర్గం మొత్తం ఒక్క టీడీపీ కే పరిమితం కాలేదు, అలాగే రెడ్డి సామాజికవర్గం మాత్రమే వైసీపీ భుజం కాయడంలేదు, ఇక కేసీఆర్ సామాజికవర్గం మాత్రమే బిఆర్ఎస్ ను రాజకీయంగా ముందుకు తీసుకెళ్లలేదు, అలాగే రేవంత్ రెడ్డి కి రెడ్డి సామాజికవర్గం మాత్రమే మద్దతు తెలపలేదు. మరి కాపు సామాజికవర్గం మాత్రమే పవన్ పై కుల రాజకీయ ఒత్తిడి ఎందుకు చేస్తున్నట్లు.?
కులం పేరు చెప్పుకుంటూ ఈ సోకాల్డ్ కాపు నాయకులు జనసేనకు రాజకీయ సమాధి కట్టాలనుకుంటున్నారా.? కులం పరిధి దాటి పవన్ ను రాజకీయంగా ముందడుగు వెయ్యనివ్వరా.? బాబు, జగన్ , కేసీఆర్, రేవంత్, తాజాగా విజయ్ రాజకీయ ఎదుగుదలను ఆయా కుల నాయకులు అడ్డుకున్నారా.? అలాగే తమ బెదిరింపులతో, తమ నినాదాలతో వారిని రాజకీయంగా వెనక్కి లాగుతున్నారా.?
పవన్ పై కుల రాజకీయాలకు ఒత్తిడి చేస్తున్న కాపు నేతలు జనసేనను ఒక కాపు కులానికే పరిమితం చెయ్యాలనుకుంటున్నారా.? లేదా కాపు కులం పేరుతో పవన్ ను ఇతర సామాజికవర్గాల వారికీ దూరం చెయ్యదలచారా.? అసలు పవన్ పై కుల రాజకీయ ఒత్తిడి చేస్తున్న ఆ కాపు నాయకులెవరు.?
హరిరామ జోగయ్య వంటి కాపు కుల పెద్ద నుంచి మొదలుకుని వైసీపీ కాపునేతలైన ముద్రగడ, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్, బొత్స సత్యనారాయణ వంటి నేతల వరకు కాపు రాజకీయ ఎదుగుదల అంటూ జనసేన మీద రాజకీయం చేస్తూ పవన్ రాజకీయ పతనం కోరుకున్న మాట వాస్తవం కాదా.? ఇదేనా ఆ సోకాల్డ్ కాపు నేతలు చెప్పుకునే సామజిక ఐక్యత.?
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…