Telugu

బాబు అరెస్టు ప్రభుత్వాలను భయపెడుతుందా.?

నాటి చంద్రబాబు నాయుడి అరెస్టు ఇప్పటి ప్రభుత్వాలను రాజకీయంగా భయపెడుతుందా.? ఆ అరెస్టు తరువాత ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు నేటి ప్రభుత్వాలను ముందుకెళ్లనివ్వడం లేదా.?

బాబు అరెస్టుతో టీడీపీ పై ప్రజలలో పెరిగిన సింపతీ, బాబు వెనుక ప్రజలు నిలబడిన తీరు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఆలోచనలో పడేస్తున్నాయా.?

ADVERTISEMENT

నాటి వైసీపీ ప్రభుత్వం అనుసరించిన నియంతృత్వ విధానాలకు, రాజకీయ కక్ష్య సాధింపు చర్యలకు ఇక ముగింపు పలకాల్సిన రోజు వచ్చేసింది అనే భావన బాబు అరెస్టుతో ప్రజలలో బాగా బలపడిపోయిందా.? దాని ఫలితమే వై నాట్ 175 అన్న వైసీపీ కలను వై నాట్ 11 గా మార్చిందా.?

ఇలా అనేక ప్రశ్నలు, సందేహాలు ఇటు కూటమి ప్రభుత్వాన్ని, అటు రేవంత్ సర్కార్ ని నీడలా వెంటాడుతున్నాయా.? ఈ కారణమే ఫోన్ టాపింగ్ కేసుని ముందుకు తీసుకెళ్లనివ్వకుండా చేస్తుందా.? ఫార్ములా ఈ కేసును వెనక్కి లాగుతుందా.? కాళేశ్వరం పై ప్రభుత్వం స్వరం పెంచకుండా ఆపుతుందా.?

అలాగే ఇటు ఏపీలో లిక్కర్ కేసు బిగ్ బాస్ వరకు వెళ్లకుండా అడ్డుకుంటుందా.? జిత్వాని కేసుని కనుమరుగు చేసిందా.? తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో వేగం పెంచలేకపోతుందా.? ఈ కేసులతో అధికార కూటమి, కాంగ్రెస్ ప్రభుత్వాలు దూకుడుగా ముందుకెళితే దాని పర్యవసానాలు పార్టీ అధినేత వరకు వెళతాయి.

తత్పలితంగా వారి అరెస్టులు, ఆయా పార్టీలకు పొలిటికల్ మైలేజ్ ని తెచ్చిపెడుతుంది, ఆ సానుభూతి కోణం ఆయా పార్టీలను తిరిగి రాజకీయంగా పుంజుకునేలా చేస్తుంది, అలాగే వారికీ తిరిగి అధికార పీఠం అందుకునే అవకాశాన్ని ఇస్తుంది అనే భావన ప్రభుత్వాలలో బలపడిపోయిందా.?

అవును ఇప్పుడు ఈ ఆలోచనలే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల దూకుడుకి కళ్లెం వేస్తున్నాయి. అక్కడ రేవంత్ కానీ ఇక్కడ బాబు కానీ ఆయా పార్టీల అధినేతలకు ఆ అవకాశం ఇవ్వకూడదను అనే భావిస్తున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు సొంత పార్టీ క్యాడర్ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి.

అందుకే ప్రభుత్వాలు ప్రతిపక్షాల పై అవినీతి ఆరోపణలతో, అక్రమాల విమర్శలతో సరిపెట్టాలని చూస్తుందా.? కొత్త ప్రభుత్వాలు ఏర్పడి రెండేళ్ళైనా ఇప్పటికి అటు బిఆర్ఎస్ పై కానీ ఇటు వైసీపీ పై కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం కానీ అక్కడ రేవంత్ సర్కారు కానీ దూకుడుగా ముందుకెళ్లలేకపోతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana: Rs. 15000 Crores Dream, But Where’s the Hype?

Ramayana Part 1 is arriving in a month. The movie has already created buzz with…

5 minutes ago

Trivikram’s God of War: NTR Fans Panic After AK47 Fiasco

NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…

8 hours ago