జిత్వాని కేసులో ‘దిశా’ చట్టం వర్తించదా..!

జిత్వాని కేసు తో వైసీపీ కూసాలు కదలబోతున్నాయి. ఇప్పటికే ఈ కేసు విచారంలో భాగంగా వైసీపీ నేతల అరాచకాలకు వత్తాసు పలికిన ముగ్గురు ఐపీఎస్ విశాల్ గున్నా, కాంతి రాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయుల పై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.

అయితే అటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటుగా మరికొంతమంది వైసీపీ ముఖ్య నేతల పేర్లు కూడా జిత్వాని తన ఫిర్యాదులో పేర్కొంన్నారు. అలాగే తన పట్ల ఎస్ఐ దుర్గా దేవి కూడా అమానుషముగా ప్రవర్తించినట్లు జిత్వాని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు ఒక లేఖ రాసారు. దీనితో ఎస్ఐ దుర్గా దేవి మీద విచారణకు ఆదేశించారు రాష్ట్రపతి ముర్ము.

ADVERTISEMENT

మహిళా భద్రతే వైసీపీ లక్ష్యం, దానికోసమే చట్టాలలో సంస్కరణలు అంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో దిశా చట్టాన్ని రూపొందించి దిశా యాప్ ను ఆవిష్కరించారు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు వైస్ జగన్ మోహన్ రెడ్డి.

మీ భద్రత మీ చేతిలోనే అంటూ అప్పుడు ప్రచారం చేసుకున్న వైసీపీ నేతలు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని డాక్టర్ కమ్ బాలీవుడ్ నటి అయినా జిత్వానిని, ఆమె కుటుంబాన్ని అన్యాయంగా విజయవాడకు తీసుకొచ్చి నెల రోజుల పాటు వేధించారు.

అయితే ఇప్పటికే వైసీపీ నేత, జగన్ సన్నిహితుడు కుక్కల విద్యాసాగర్ తన పట్ల ప్రవర్తించిన తీరును ప్రజలు ముందుంచారు జిత్వాని. అలాగే వైసీపీ నేతల నిజ స్వరూపాలను మీడియా సాక్షిగా భయపెట్టారు.

ఇటువంటి అరాచకాలకు సలహాలిచ్చిన వైసీపీ పెద్దమనుషుల భాగోతాలు కూడా త్వరలోనే భయటపడనున్నాయి. అయితే మరి ఒక మహిళ మీద ఇంతటి క్రూరత్వాన్ని చూపిన వైసీపీ నేతల మీద, అందుకు సహకరించిన అధికారుల మీద కానీ దిశా చట్టం వర్తించదా.?

జగన్ ఆర్బాటంగా ప్రచారం చేసుకున్న దిశా చట్టం వైసీపీ పాలిట చుట్టమా.? ఒక మహిళ తనకు వైసీపీ ప్రభుత్వం హయంలో, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్యాయం జరిగింది అంటూ కన్నీటితో నిలదీస్తున్నా జగన్ ఎక్కడ నోరు విప్పరే.? అంటే జగన్ దృష్టిలో ఈ కేసుకు దిశా చట్టం వర్తించదా.?

జగన్ చేసే సాయం ప్రకటనల రూపంలో, చేసే చట్టాలు ప్రచారాల రూపంలోనే కానీ ఏవి ఆచరణ సాధ్యం కావన్నమాట..! ఒక్క ఆడదాన్ని బంధించడానికి ప్రభుత్వ వ్యవస్థలనూ, తన అధికార యంత్రంగాన్ని వినియోగించుకున్నారు జగన్. టీడీపీ, జనసేన నేతలు ఆరోపించినట్లు సొంత చెల్లికి న్యాయం చేయలేని వారు ఇక మిగిలిన మహిళల పట్ల గౌరవముగా వ్యవహరిస్తారు అనుకోవడం వెర్రి తనమే అవుతుందేమో.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Not Only Rajini, But He Also Can Deliver 500 Cr?

Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…

31 minutes ago

స్థానికంలో మచ్చుకి కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు…

స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…

51 minutes ago