
మహాభారతంలో ఎక్కువ నిందలు, కష్టాలు, అవమానాలు, శాపాలు మోసిన వారిలో కర్ణుడు కూడా ఒకడు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు పరిస్థితి కూడా సరిగ్గా ఇదే!
నాడు దుర్యోధనుడు కోసం కర్ణుడు తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడాడు. అలాగే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కోసం హరీష్ రావు కూడా అలాగే పోరాడారు. ఇంకా పోరాడుతూనే ఉన్నారు.
కానీ కల్వకుంట్ల కవితతో సహా పలువురు ఆయనని ‘కట్టప్ప.. కట్టప్ప…’ అని నిందిస్తుంటే కర్ణుడిలా మౌనంగా ఆ నిందలు భరిస్తున్నారు.
బహుశః అందువల్లేనేమో… కేసీఆర్ కన్న కూతురు కవితని బయటకు గెంటేశారు కానీ హరీష్ రావుని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన కూడా కేసీఆర్‌ని నీడలా అంటిపెట్టుకునే ఉన్నారు.
గతంలో హరీష్ రావు, కేటీఆర్‌లతో కలిసి పనిచేసిన కడియం శ్రీహరి, “కేసీఆర్ ఉన్నంత వరకే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. తర్వాత తన దారి తాను చూసుకుంటారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలు అవుతుంది,’ అని అన్నారు.
పనిలో పనిగా “కేటీఆర్‌కి చాలా పొగరు, నోటి దురుసు, అహంకారమని, ఆయనకు తండ్రిలా నాయకత్వ లక్షణాలు లేవని” సర్టిఫై చేశారు. హరీష్ రావు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇంకా నిలబడి ఉందని లేకుంటే ఎప్పుడో చెల్లా చెదురు అయిపోయేదన్నట్లు కడియం మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న కడియం, బీఆర్ఎస్ పార్టీలోని హరీష్ రావుని ఈవిదంగా వెనకేసుకు వస్తే, “అయితే హరీష్ రావు ఖచ్చితంగా కట్టప్పే,” అని అనిపించవచ్చు.
కానీ ఆయన వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇంకా నిలబడి ఉందని చెపుతున్నారు. కనుక దానిని కాపాడుతున్న రక్షకుడు కూడా ఆయనే అనిపించవచ్చు.
కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చనిపోయే వరకు అందరికీ ఆయన గురించి ఇలాంటి డైలామాయే ఉండేది. కనుక హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో కట్టప్పా? లేదా బాహుబలి (కేసీఆర్)ని కాపాడుకొస్తున్న రక్షకుడా? అనేది తెలియాలంటే కురుక్షేత్రం జరగాల్సిందే!
Shruti Haasan has never been someone who avoids uncomfortable conversations. Whether it is relationships, sexuality…
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి మొదలవుతాయి. ఇదివరకు బతుకమ్మ పండుగ, ఆ వేడుకలకు కల్వకుంట్ల…