
కల్వకుంట్ల కవిత పార్టీపై తిరుగుబాటు చేసి తండ్రిని దూరం చేసుకొని మొదటి తప్పటడుగు వేశారు. ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉన్నంత కాలం ఆమె తెలంగాణలో ఎక్కడకు వెళ్ళినా ప్రజలు నీరాజనాలు పట్టేవారు. ఆమె విదేశాలకు వెళ్ళినా బీఆర్ఎస్ అభిమానులు ఆమెకు జేజేలు పలికేవారు.
కనుక తాను రాజకీయంగా చాలా బలవంతురాలినని ఆమె భ్రమ పడ్డారు. కానీ మెడలో గులాబీ కండువా లేకపోయేసరికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా సైతం ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఆమె తండ్రి ఏవిదంగా రాజకీయాలలో ఏకాకిగా మిగిలిపోయారో ఆమె కూడా అలాగే ఏకాకిగా మిగిలిపోయారు
అయినప్పటికీ ఆమె ఒంటరి పోరాటం చేస్తూ తన రాజకీయ మనుగడ కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించని విదంగా ఆమె బీసీ రిజర్వేషన్స్ అంశం భుజానికెత్తుకొని ‘రైల్ రోకో’కి సిద్దపడ్డారు. ఆమె అదృష్టం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. లేకుంటే ఆమె ‘రైల్ రోకో’తో నవ్వులపాలయ్యే వారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనని ఆమె తన తొలి విజయంగా చెప్పుకున్నారు. రాజకీయాలలో ఒక మెట్టు ఎక్కానని చెప్పుకున్నారు.
కానీ 24 గంటలు గడవక ముందే రాజకీయాలలో ఆమె స్థానం రెండు మూడు మెట్లు కిందకు పడిపోయింది. కారణం.. బీసీలకు ప్రతినిధినని చెప్పుకొంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై ఆమె అనుచరులు దాడి చేసి విధ్వంసం సృష్టించడమే. ఆమెని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమె అనుచరులు దాడికి పాల్పడ్డారు.
తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆమె దీనిని మరో రాజకీయ అవకాశంగా భావించి మహిళా సంఘాల మద్దతుతో నిరసనలు చేపట్టి ఉంటే మరో మెట్టు ఎక్కగలిగేవారు. కానీ తన అనుచరుల చేత మల్లన్న కార్యాలయంపై దాడి చేయడం రాజకీయంగా తప్పటడుగు వేశారు.
ఇప్పుడు ఈ సాకుతో కాంగ్రెస్, బీజేపీలు ‘కేసీఆర్ ఫ్యామిలీలో అందరూ ఇంతే. ఎన్నికలలో ఓడినా బుద్ధి రాలేదు. బీసీలంటే కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ చాలా చులకనభావం ఉందని,” విమర్శించకుండా ఉండరు.
తండ్రి, బీఆర్ఎస్ పార్టీ మద్దతు లేకుండా రాజకీయాలలో ఒంటరిగా ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత ఈవిదంగా చేయడం వలన ఆమె ఎదురీత మరింత కష్టమవుతుంది కూడా.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…