
గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పైన, ఆ పార్టీ నాయకత్వం పైన కవిత చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు తెలంగాణలో కవిత రాజకీయ ప్రయాణం మీద ఎన్నో సందేహాలను లేవనెత్తుతున్నాయి.
అయితే కల్వంట్ల కవిత టీవీ 5 కి ఇచ్చిన ఇంటర్ వ్యూ లో ఆ సందేహాలకు మరికొన్ని అంశాలను జోడిస్తూ బిఆర్ఎస్ పై మరికొన్ని బాణాలు ఎక్కుపెట్టారు. ఇందుకు గాను ఆమె తీసుకున్న మొదటి స్టెప్ టీవీ 5 ని ఎంచుకోవడమే అవుతుంది.
టీవీ 5 అనేది బిఆర్ఎస్ కు వ్యతిరేకమైనది అనే భావన బిఆర్ఎస్ శ్రేణులలో బలంగా ఉంటుంది. అటువంటి ఛానెల్ ను కవిత ఎంచుకోవడం, అందులో తన మనోగతాన్ని పూర్తిగా ఆవిష్కరించడంలో బిఆర్ఎస్ కారు ప్రయాణంలో కవిత అంకం త్వరలోనే ముగియబోతుందా అన్న అనుమానాలు తలెత్తాయి.
ఈ ఇంటర్ వ్యూ లో కవిత తనకు తన అన్న కేటీఆర్ కు మధ్య ఏర్పడిన గ్యాప్ పై స్పష్టత ఇచ్చారు. అలాగే తానూ కేసీఆర్ ను తప్ప మరొకరిని నాయకుడిగా అంగీకరించేది లేదు అంటూ కుండబద్దలు కొట్టారు. ఇక భవిష్యత్ లో పదేళ్లకో, పదిహేనేళ్లకో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదిగి తీరుతాను అంటూ ఖరాకండిగా చెప్పారు.
తన తండ్రి కేసీఆర్ కి తానూ రాసిన లేఖ బయటకు లీక్ అయిననాటి నుంచి నేటి వరకు తనకు కేటీఆర్ కు మధ్య సమస్యలు ఏర్పడిన మాట వాస్తవం అంటూ చెప్పుకొచ్చిన కవిత, తన అరెస్టు వార్తలు బయటకొచ్చిన నాటి నుంచి తానూ జైల్లో ఉన్నప్పటి వరకు తన పై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు గాని, ప్రత్యర్థి పార్టీలు చేసే ఆరోపణలకు గాని బిఆర్ఎస్ పార్టీ సరైన తీరులో స్పందించలేకపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేసారు.
అలాగే తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ తనకు నిధులు మంజూరు చేయలేదంటూ కేసీఆర్ మీద కూడా రాజకీయ ఆరోపణలు చేసారు కవిత. ఇక తెలంగాణ రాజకీయాలను ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీని కుదిపేస్తున్న ఫోన్ టాపింగ్ అంశం మీద కూడా కవిత బిఆర్ఎస్ ను ఇరుకునపెట్టేలా స్పందించారు.
కవిత చేస్తున్న ఈ విమర్శలు బిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టాన్ని తేవడంతో పాటు ప్రత్యర్థి పార్టీ అయిన అధికార పక్షానికి ఆయుధం గా మారుతుంది. అయితే ఇన్నాళ్ళుగా బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, బిఆర్ఎస్ నాయకత్వానికి విరుద్ధంగా కవిత చేస్తున్న రాజకీయ విమర్శలకు అటు కేసీఆర్ కానీ ఇటు కేటీఆర్ కానీ ఎటువంటి కౌంటర్ ఇవ్వలేదు.
దీనితో నానాటికి కవిత బిఆర్ఎస్ కు గొంతులో ముళ్ళు మాదిరి తయారయ్యి పార్టీని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ కారణంగా కేసీఆర్ కవిత ను బిఆర్ఎస్ కారు దింపే ప్రయత్నం చేస్తారు అంటూ తెలంగాణ రాజకీయాలలో ప్రచారం జరుగుతుంది.
అయితే నాడు షర్మిల ABN తో ఇంటర్ వ్యూ ద్వారా తన అన్న జగన్ కు తనకు ఏర్పడిన విభేదాలను స్పష్టం చెయ్యగా, నేడు టీవీ 5 ద్వారా కవిత, తనకు, తన అన్న కేటీఆర్ కు మధ్య ఏర్పడిన రాజకీయ ఆధిపత్యానికి క్లారిటీ ఇచ్చారు. నాడు షర్మిల వైసీపీ తో తెగతెంపులు చేసుకుని జగన్ ఫ్యాన్ కింద నుంచి బయటకొచ్చారు, నేడు కవిత బిఆర్ఎస్ తో విభేదించి కేసీఆర్ కారు దిగుతారా.?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…