
పేర్ని నాని తన చర్యలతో తన రాజకీయ వారసుడు కిట్టుకి మార్గం చూపిస్తున్నారా.? లేక దారులు మూసేస్తున్నారా.? అన్న కెహెర్చ జరుగుతుంది. వైసీపీ పార్టీ ఓడినప్పటి నుంచి గత ఐదేళ్లు తెరవెనుక పెత్తనం చేసిన జగన్ సామాజికవర్గం నేతలు ఎవ్వరు ఇప్పుడు తెరముందుకు వచ్చేందుకు సిద్ధంగా లేరు.
జిత్వాని కేసు నుంచి ఏపీ లిక్కర్ స్కాం వరకు అన్ని వివాదాలలో ఈ సోకాల్డ్ రెడ్డి సామాజికవర్గం నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తుంది. సజ్జల రామకృష్ణ రెడ్డి మొదలు, పెద్ది రెడ్డి, కసి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి…ఇలా అనేకానేకమంది రెడ్డి సామాజికవర్గ నేతలు వేల కోట్ల అవినీతి ఆరోపణలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇలా గత ఐదేళ్లు దండిగా మూటలు వెనకేసుకున్న ఈ నాయకులు ఇప్పుడు వైసీపీ ఓటమిలో మాత్రం ముఖం చాటేస్తూ కనీసం పార్టీ క్యాడర్ కు భరోసా కోసం కూడా మీడియా ముందు కనిపించడం లేదు.
అలాగే తన బూతులతో తెలుగు భాషకే తెగులు పుట్టించిన కొడాలి నాని, కర్రలతో బాబు ఇంటి మీదకు దాడులకు యత్నించిన జోగి రమేష్ వంటి వారు కూడా వైసీపీ ఓటమితో, తమ గత ఐదేళ్ల తప్పిదాలను, దాని పట్ల ప్రజలలో వచ్చిన వ్యతిరేకతను అర్ధం చేసుకుని మౌనంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కానీ నేను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను నా రాజకీయ వారసుడిగా నా కొడుకు కిట్టుని ప్రకటిస్తున్నాను అంటూ మచిలీపట్టణం ఎమ్మెల్యే టికెట్ ను కిట్టుకి కేటాయించుకున్నారు పేర్ని నాని.
అయితే గత ఐదేళ్ల పేర్ని నాని విధేయతకు, ఆయన రాజకీయ విమర్శలకు ప్రతిఫలం ఆయన తనయుడు కిట్టుకి శాపంగా మారింది. నేను జగన్ పెద్ద పాలేరు అంటూ సగర్వంగా ప్రకటించుకున్న పేర్ని నాటి నుంచి నేటి వరకు వైస్ జగన్ పట్ల అదే విధేయత, వైసీపీ పట్ల అదే సానుకూలత ప్రకటిస్తూ వైసీపీ విధ్వంసానికి వంత పాడుతున్నారు, జగన్ అరాచకానికి కొమ్ము కాస్తున్నారు.
దీని ఫలితం అనుభవించడానికి కిట్టు మరోసారి సిద్ధంగా ఉండాల్సిందే. పేర్ని నాని తన విధేయతతో కొడుకు కిట్టు రాజకీయ భవిష్యత్ ను బలిపీఠం ఎక్కించనున్నారా.? జగన్ ఆడే రాజకీయ చదరంగంలో పేర్ని పావుగా మారి తన రాజకీయ వారసుడి భవిష్యత్ ను హరించేస్తున్నారా.?
ప్రజల ఆలోచనలకు దూరంగా, నియోజవర్గ సమస్యలకు ప్రాధాన్యం లేకుండా కేవలం స్వామి భజనకు, పార్టీ పూజకు మాత్రమే పేర్ని ఆసక్తి చూపితే కిట్టు భవిష్యత్ రాజకీయం కూడా ప్రతిపక్షానికే పరిమితం కావాల్సిందే అన్న అభిప్రాయం వినపడుతుంది.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…