
బహుశః ఆంధ్రా ప్రజలెన్నడూ ఇంత ఆతృతగా ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూసి ఉండరేమో? వారి ఆతృతకు కారణాలు అందరికీ తెలుసు.
ఐదేళ్ళ వైసీపి అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి లభిస్తుందా? రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధి చెందుతుందా లేదా?ఈసారైనా రాజధాని అమరావతి ఏర్పడుతుందా లేదా? అని టిడిపి, జనసేనలను అభిమానించేవారు ఆతృతగా ఎదురుచూస్తుంటే, జగన్ రాకపోతే సంక్షేమ పధకాలు లభిస్తాయా లేదా? అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
సర్వేలన్నీ టిడిపి కూటమికే మొగ్గుచూపుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ కూడా వైసీపి ఓటమి ఖాయమని చెప్పేశారు. కానీ గత ఎన్నికల కంటే మరికొన్ని సీట్లు ఎక్కువే వస్తాయని జగన్ వైసీపి శ్రేణులకు ధైర్యం చెప్పారు. కానీ వైసీపి నేతలు ఇంకా ఎందుకో ఆక్రోశిస్తూనే ఉన్నారు.
ఇంతవరకు తోడేళ్ళ గుంపులో టిడిపి, జనసేనలు, వాటి మీడియా మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ గుంపులో ఏపీ పోలీసులు, రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేరిపోయాయని ఆక్రోశిస్తున్నారు.
కానీ పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లను చూసిన ప్రజలు, కౌంటింగ్ రోజున చివరి ప్రయత్నంగా వైసీపి శ్రేణులు మరోసారి ‘చొక్కా చేతులు మడత పెట్టే’ ఆలోచనలో ఉన్నారని భయపడుతున్నారు. మాచర్లలో విధ్వంసం సృష్టించిన వైసీపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆ ప్రాంతంలో ప్రజలు హడలిపోతున్నారు.
ఎన్నికలలో ఏ పార్టీ, కూటమి గెలుస్తుందనే ఉత్కంఠ ఎలాగూ అందరిలో ఉంది. కానీ కౌంటింగ్ రోజున, ఆ తర్వాత ఇంకెన్ని అల్లర్లు, దాడులు, విధ్వంసం జరుగుతాయో? అని సామాన్య ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో కౌంటింగ్ రోజు నుంచి మరో 15 రోజుల పాటు 5 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను కేంద్ర ఎన్నికల కమీషన్ మోహరింపజేస్తోంది. జగన్ పాలన ముగింపు కూడా ఇంత భీభత్సంగా ఉంటుందని బహుశః ఎవరూ ఊహించి ఉండరేమో?
కనుక చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే మొట్ట మొదట రాష్ట్ర ప్రజల భద్రతకు పూర్తి భరోసా కల్పించే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఏదైనా.
Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…
Teju Ashwini brings a fresh burst of pink to this dreamy indoor photoshoot, and the…