
వైసీపీలో చక్రం తిప్పి ఓ వెలుగు వెలిగిన విజయసాయి రెడ్డి హటాత్తుగా పార్టీకి, పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అదీ… జగన్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు! ఆ తర్వాత మద్యం కుంభకోణం కేసు విచారణకు హాజరైనప్పుడు జగన్-కోటరీ అంటూ విమర్శలు గుప్పించారు. కానీ తర్వాత సైలంట్ అయిపోయారు.
ఇటీవలే మళ్ళీ రాజకీయాలలో రీ-ఎంట్రీ ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ‘హిందుత్వ రాగం’ కూడా ఆలపిస్తున్నారు.
“హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు. డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం.
గత రెండు దశాబ్దాలుగా జరిగిన మతమార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వం విచారణ జరపాలి. దేశం కోసం ధర్మం కోసం హిందువులలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఒక్కటవ్వాలి .. అదే భారతదేశానికి రక్ష … శ్రీరామ రక్ష …” అని ట్వీట్ చేశారు.
ఇది బీజేపిలో చేరేందుకేనని అర్ధమవుతూనే ఉంది. దీని తర్వాత ఓటర్ల జాబితా సవరణ (సర్) విషయంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ మరో ట్వీటేశారు.
కనుక విజయసాయి రెడ్డికి పూర్తి క్లారిటీ ఉందని, ఇప్పుడు ఇలాంటి ట్వీట్స్ వేస్తూ ప్రజలను కూడా మానసికంగా సిద్ధం చేస్తున్నారని అనుకోవచ్చు. కనుక ఈ రాజకీయ సన్యాసం డ్రామా త్వరలో ముగించబోతున్నట్లే భావించవచ్చు.
కానీ 11 అక్రమాస్తుల కేసులలో ఏ-2గా జగన్‌తో పాటు 16 నెలలు చంచల్ గూడ జైలులో గడిపిన విజయసాయి రెడ్డిని బీజేపి చేర్చుకుంటుందా?చేర్చుకుంటే ప్రజలకు ఎటువంటి సంకేతాలు వెళతాయి?
ఒకవేళ ఆయనని బీజేపిలో చేర్చుకుంటే, ఇది వైసీపీకి… దాని అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద షాక్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ వాస్తవానికి విజయసాయి రెడ్డిని బీజేపిలో చేర్చుకుంటే, దాని వలన జగన్‌కు చాలా మేలు కలుగుతుంది.
ఏవిధంగా అంటే, విజయసాయి రెడ్డిని బీజేపిలో చేర్చుకుంటే ఈడీ సీబీఐలు అక్రమాస్తుల కేసులలో ఇక ఆయన జోలికి వెళ్ళవు.
ఏ-2గా ఉన్న ఆయనకు మినహాయింపు లభిస్తే, ఏ-1గా ఉన్న జగన్‌తో సహా ఆ కేసులను ఎదుర్కొంటున్న అందరికీ తప్పక ఉపశమనం లభిస్తుందని వేరే చెప్పక్కరలేదు.
కనుక ఈ కేసుల నుంచి విముక్తి కోసమే జగన్, విజయసాయి రెడ్డి ఇద్దరూ కలిసి ఈ రాజీనామా-రాజకీయ సన్యాసం డ్రామాకి రూపకల్పన చేసి అమలు చేస్తున్నారా? అనే కొత్త సందేహం కలుగుతుంది.
ఒకవేళ విజయసాయి రెడ్డి బీజేపిలో చేరితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏవిధంగా రియాక్ట్ అవుతారు? వారు అయన చేరికని ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారు?ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాబోయే రోజుల్లో లభిస్తాయి.
Getting a film to the release date is one thing. Getting it past the censor…
Ram Charan faced one of the biggest setbacks of his career with Zanjeer, which was…