
మిథున్ రెడ్డి అరెస్టు తో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దీనితో లిక్కర్ స్కాం లో అరెస్టవ్వబోయే ఆ నెక్స్ట్ వైసీపీ నేత ఎవరు అనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది.
ఈ నేపథ్యంలో వైసీపీ ముఖ్య నాయకుడు, జగన్ కోటరీ కీలక సభ్యుడు, మాజీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి వైసీపీ శ్రేణులకు తన ఇంటర్ వ్యూ లతో స్పష్టత ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇన్నాళ్లు లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న వైసీపీ కీలక నేతలు ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్లడంతో కేసు విషయంలో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదనే స్పష్టత అటు కూటమి క్యాడర్ తో పాటుగా వైసీపీ లీడర్లకు వచ్చింది.
దీనితో మిథున్ రెడ్డి అరెస్టు తో పార్టీ నష్ట నివారణ చర్యల పై సజ్జలకు తాడేపల్లి ప్యాలస్ నుంచి తీవ్ర స్థాయి ఒత్తిడి ఎదురవుతున్న వేళ సజ్జల సాక్షి, టీవీ 9, ఎన్టీవీ, టీవీ 10 లలో ప్రత్యక్షమయ్యి ఇంటర్ వ్యూ లు ఇస్తూ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి అరెస్టు పై స్పందిస్తూ, ఆపై జగన్ అరెస్ట్ పట్ల పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది.
ఈ ఇంటర్ వ్యూల ముఖ్య ఉద్దేశం పార్టీ నష్ట నియంత్రణ, కేసులో పార్టీని సమర్ధించడానికి క్యాడర్ కు నాయకులకు తగినంత సమాచారం అందించడం అయినప్పటికీ అది పూర్తి స్థాయిలో జరగలేదనే చెప్పాలి.
అందులో భాగంగానే సజ్జల నిత్యం రాజకీయ ప్రసంగాలు చేస్తూ జగన్ అరెస్టుకు పార్టీ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టుతో కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో ఎంత సీరియస్ గా ఉందో వైసీపీ శ్రేణులకు అవగతం అయ్యింది.
సిట్ ప్రకారం ప్రధాన నిందితుడు (A-1) రాజ్ కసిరెడ్డి ప్రతి నెల 50 – 60 కోట్లు వసూలు చేసి ఆ మొత్తని వైసీ ఎంపీ మిథున్ రెడ్డి (A- 4), అప్పటి వైసీపీ నాయకుడు విజ్జయి సాయి రెడ్డి (A -5), భారతి సిమెంట్ గోవిందప్ప బాలాజీ (A-33) లకు అప్పగించారు.
ఇందులో సాయి రెడ్డి గతంలో జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసీపీ లో నెంబర్ 2 నాయకుడు కాగా, మిథున్ రెడ్డి వైసీపీ కీలక నేత, ఇక గోవిందప్పతో జగన్ సతీమణి భారతి సిమెంట్ ఆర్థిక వ్యవహారాలను చూసుకునేవారు.
వీరంతా ఒక్కొక్కరుగా అరెస్టవుతూ జగన్ అరెస్టుకు కూడా బాటలు వేస్తున్నారు. వారు అప్పుడప్పుడు జగన్ కు డబ్బు బదిలీలు చేసేవారని, ఈ విధంగా దాదాపు మొత్తం 3500 కోట్లు దోచుకున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.
దీన్ని బట్టి చూస్తే ఈ కేసులో జగన్ మోహన్ రెడ్డి,మరియు ఆయన పార్టీ వైసీపీ అంతిమ లబ్దిదారులని స్పష్టమవుతుంది.ఈ కేసులో ఉన్న ఆర్థిక లావాదేవీల పై సిట్ కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది.
తద్వారా ఈ కేసులో జగన్ పై ఊహించిన దానికంటే ఉచ్చు బలంగా బిగిసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరెస్టయిన మిథున్ రెడ్డి విషయంలో కూడా వైసీపీ క్యాడర్ వైసీపీ అధిష్టానాన్ని పూర్తిగా నిరాశపరిచింది.
మిథున్ రెడ్డి అరెస్టు పై నిరసనలు తెలిపేందుకు కూడా వైసీపీ క్యాడర్ రోడ్ల మీదకు రాని పరిస్థితి. ఇక సజ్జల త్వరలో అధినేత జగన్ కూడా అరెస్టు కాబోతున్నారు అంటూ క్యాడర్ కు హింట్లు ఇస్తూ జగన్ అరెస్టుకు వైసీపీ ని కూడా మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు.
India will play 14 ODIs before IPL 2027 as the team prepares for the 2027…
The 80s seem to be back in Tollywood. A trend that started on social media…