వైసీపీ ‘ప్రతిపక్ష’ పార్టీనా.? ‘అతిధి’ పార్టీనా..?

అధికారంలో ఉంటే రాష్ట్రంలో, ప్రతిపక్షంలో ఉంటే పర్యటనలో అన్నట్లుగా ఉంటుంది వైసీపీ పార్టీ తీరు. అధినాయకుడు బెంగుళూర్ లో, అధికార ప్రతినిధులు హైద్రాబాద్ లో, మాజీలు పొరుగు రాష్ట్రాలలో ఇలా తలోదిక్కున ఉంటూ ఏపీ రాజకీయాలను తామే చక్కదిద్దేస్తున్నాం అన్న భావనలో గడిపేస్తున్నారు.

పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక మెట్రో రైలు మాదిరి విజయవాడ టూ బెంగళూర్ తిరుగుతూ కూటమి ప్రభుత్వం పై సోషల్ మీడియా వేదికగా విషం జిమ్ముతూ ఉంటారు. ఒక మెరుపు తీగ లాగా ఇలా వస్తున్నారు అలా వెళ్లిపోతున్నారు.

ADVERTISEMENT

వచ్చినపుడు కూటమి ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు, వెళ్ళేటప్పుడు తన పార్టీ రాజకీయ అవసరాలు అన్నట్టుగా జగన్ బెంగుళూర్ యాత్రలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రతిపక్షములోకి రాగానే ముందుగా ఏపీలో శవ రాజకీయాలకు తెర లేపిన జగన్ ఆ తరువాత వరద రాజకీయాలకు నాంది పలికారు.

ఏపీలో జరిగిన హత్యలకు ఢిల్లీ వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అలాగే విజయవాడలో వచ్చిన వరదలకు బెంగుళూర్ నుండి వచ్చి ప్రభుత్వం మీద నిందలు వేశారు. కర్ణాటకలో ఉంటూ ఏపీ ప్రజల తరుపున సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వం పై పోరాడుతున్న గొప్ప నాయకుడు వైస్ జగన్.

అలాగే తెలంగాణ లో ఉంటూ ఏపీ రాజకీయాల గురించి టీవీ డిబేట్లలో చర్చించడానికి సిద్ధమయ్యారు ఆ పార్టీ అధికార ప్రతినిధులు. వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ నేతలతో పాటుగా ఆ పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఒక్కొక్కరుగా హైద్రాబాద్ కు జారుకున్నారు.

అలాగే ఆ పార్టీ తరుపున కొత్తగా ఎన్నుకోబడిన అధికార ప్రతినిధులు కూడా హైద్రాబాద్ వాసులు కావడం ఇక్కడ కొసమెరుపు. వీరికి ఆంధ్రప్రదేశ్ తో కానీ అక్కడి ప్రజలతో కానీ ఎటువంటి సంబంధం ఉండదు.

కానీ వైసీపీ తరుపున రాజకీయం చేస్తూ ఏపీ లో ఏవో దారుణాలు జరిగిపోతున్నాయి, అక్కడి ప్రజలకు ఎదో అన్యాయం జరిగిపోతుంది అంటూ తెగ హడావుడి చేసి చివరికి సోషల్ మీడియాకు ఆహారమవుతున్నారు.

ఇక వైసీపీ మాజీల విషయానికి వస్తే, గత ఐదేళ్లు నిత్యం మీడియాలో కనిపిస్తూ ప్రత్యర్థి పార్టీల నాయకులను బూతులతో తిడుతూ రాజకీయాలను భ్రష్టు పట్టించిన సదరు నాయకులు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు.

వల్లభనేని వంశీ విదేశాలకు పారిపోయారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక రోజా గారు విదేశీ పర్యటనలు ముగించుకుని పొరుగు రాష్ట్రంలో సేద తీరుతున్నట్లు సమాచారం. కొడాలి నాని ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు.

దేవినేని అవినాష్ దొంగ చాటుగా దుబాయ్ కి పారిపోతుంటే ఎయిర్ పోర్టులో పోలీసులు పట్టుకుని రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇక వైస్ అవినాష్ ఈ చిన్న పిల్లాడు ఎక్కడ తప్పిపోయాడో తెలియడం లేదు. వైసీపీ నెంబర్ 2 గా చెప్పుకునే విజయ సాయి వైజాగ్ వివాదం దెబ్బతో ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కారు.

గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని ముక్కలుగా చేసుకుని దోపిడీకి పాల్పడిన పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు ఏకలుగులో దాక్కున్నారో తెలియదు. ఇలా ఆ పార్టీకి సంబందించిన నేతలందరూ రాష్ట్రాన్ని వీడి పొరుగు రాష్ట్రంలో ఉంటూ ఏపీ ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. దీనితో అసలు వైసీపీ ఏపీలో ప్రతిపక్ష పార్టీనా.? లేక ఒక అతిధి పార్టీనా.? అనే సెటైర్లు వినపడుతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

ఏపీ మెట్రో ఆలస్యమైనా రెండో ఆలోచన లేదు!

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ నేడు మీడియాతో మాట్లాడుతూ, “విశాఖ, విజయవాడ మెట్రో ఏర్పాటులో వివిధ కారణాలతో…

12 minutes ago

Telugu Voters Superior But Need to Change?

 The Telugu state politics are far superior when compared to other neighbouring states. This…

13 minutes ago