Telugu

రీ ‘మేకు’ లతో మా పొట్ట కొట్టొద్దు!

రీమేక్ సినిమా అంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీ సినిమా. పెద్ద హీరోలందరూ తమ తమ కెరీర్లు నిస్తేజంగా ఉన్నపుడు రీమేక్ లను నమ్ముకుని తిరిగి విజృంభించారు. నిర్మాతలు కూడా అనవసర ఖర్చు ఉండదని పెట్టుబడి తిరిగొస్తుందని ఎక్కువగా రీమేక్ ల వైపు మొగ్గు చూపే వారు. కానీ కరోనా మహమ్మారి వచ్చి అన్నీ మార్చేసింది. కరోనా తరువాత తీసిన చాలా రీమేక్ సినిమాలు దారుణంగా పరాజయాల్ని చవిచూశాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్ని చోట్లా రీమేక్ సినిమాలు అపజయాల్నే చవిచూస్తున్నాయి.

కరోనా కి ముందే రీమేక్ లు మొదలుపెట్టిన హీరోలు, కరోనా తరువాత వాటిని రిలీజ్ చేసి ఆ కలెక్షన్స్ చూసి నీరసపడిపోతున్నారు. చిక్కెక్కడ వచ్చిందంటే ప్రేక్షకులు మారారు. ఓ టి టి లో అన్ని భాషా చిత్రాలు చూసేస్తున్నారు. మన దేశం లోని సినిమాలే కాకుండా, విదేశీ భాషల్లో సినిమాలు కూడా చూస్తున్నారు. ఓ టి టి కంటెంట్ కూడా కొత్తగా ఉండి ఆకట్టుకోవడం తో వాటికి రెండేళ్లగా అలవాటు పడ్డ ప్రేక్షకులు రీమేక్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.

ADVERTISEMENT

ఒక భాషలో సూపర్ హిట్ సినిమా రిలీజ్ అయ్యిందని తెలిసిన వెంటనే, ఇంటర్నెట్ లో దాని పైరసీ ని చూసి కొంతమంది, ఓ టి టి లో వచ్చాక చూసి ఇంకొంతమంది రీమేక్ సినిమాలు మీద ఆసక్తి చూపించటం లేదు. ఇవి తెలిసి కూడా కొంతమంది హీరోలు రీమేక్ సినిమాలు చేస్తున్నారు. ఒక పరభాషా చిత్రం మన భాష లో డబ్బింగ్ అయ్యిందని తెలిసి కూడా ధైర్యంగా రీమేక్ చేస్తున్నారు. కొరియన్ సినిమాలు జనాలు చూస్తున్నారని వాటి హక్కులు కొనుక్కుని రీమేక్ చేస్తున్నారు, ఆ సినిమాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా ఉండటం వలన జనాలు ఆ సినిమాల్ని తిరస్కరిస్తున్నారు.

ఈ మధ్య కాలం లో రిలీజ్ అయిన చాలా రీమేక్ సినిమాలు నిర్మాతలకు నష్టాలు తెచ్చిపెట్టాయి. అన్ని భాషల్లో డబ్బింగ్ అయిన సినిమాని యూట్యూబ్ లో ఫ్రీగా పెట్టిన సినిమాని రీమేక్ చేస్తే , అందులో పెద్ద స్టార్ హీరో ఉన్నా..ఆ హీరో స్టార్డం కి తగ్గ కలెక్షన్స్ రావడంలేదు. ఇవి చూసిన హీరోలు రీమేక్ సినిమాల జోలికి పోవడం మానేస్తున్నారు. ఒక వైపు రీమేక్ చేసిన సినిమాని ఒరిజినల్ సినిమా తో పోల్చుతూ జనాలు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు చేతిలో వున్న సినిమాలు పూర్తి అయితే ఇక నుండి రీమేక్ సినిమాలు చేయాలనే దైర్యం చేయకపోయచ్చు . ఏదేమైనా రీమేక్ సినిమాలు రీ’మేకు’ లై నిర్మాతల్ని, హీరోల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరి భాషలో వాళ్ళు సినిమాలు చేసుకుంటే కొత్త కథలూ పుడతాయి, కలెక్షన్లూ పెరుగుతాయి, పరిశ్రమలూ కళకళలాడతాయి. ఇకనైనా మన హీరోలు రీమేక్ సినిమాల జోలికి పోవడం ఆపేస్తే మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

19 minutes ago

విజయ్‌ మొహం ఎప్పుడూ ఇంతేనా? కాస్త నటించొచ్చుగా?

ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…

28 minutes ago