‘జబర్దస్త్’ చమ్మక్ చంద్రపై యూ ట్యూబ్ హాట్ బేబీ స్వాతి నాయుడు చేసిన ఆరోపణలు సంచలనాత్మకమైన విషయం తెలిసిందే. ఈ భామ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రముఖంగా ప్రసారం కావడంతో చమ్మక్ చంద్ర చిత్తశుద్ధిపై ప్రేక్షకుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ వీడియో పాపులర్ అయినంతగా రీతిలో చంద్ర ప్రతిస్పందిచకపోవడం విశేషం.
అయితే దీనికి తెరవెనుక చాలా కధ నడిచిందని, ప్రస్తుతం ఈ గొడవ సామరస్య వాతావరణంలో సర్దుమణిగిందని అంటున్నా… ఈ విషయం చర్చల ద్వారా పరిష్కారం కావడం అనేది దేనికి సంకేతం? స్వాతి నాయుడుపై పల్లెత్తు మాట కూడా ప్రస్తావించకుండా ‘మ్యాటర్’ను సెటిల్ చేసుకోవడం దేనికి సూచిక? ‘మౌనం అర్ధాంగీకారం’ అన్న నానుడిని చంద్ర నిరూపిస్తున్నారా? ఇలాంటి అనేకానేక అనుమానాలు, ప్రశ్నలు సోషల్, వెబ్ మీడియాల వేదికగా వ్యక్తమవుతున్నాయి. అంటే ఆరోపణలు నిజమేనా? మరి వీటికి జవాబు లభిస్తుందంటారా?



