
తాజాగా ‘ఆంధ్రాలో మందు’ గురించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ప్రముఖ ‘జబర్దస్త్’ కమెడియన్ భాస్కర్ మరియు అతని తండ్రి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆంధ్రాలో మందు’ ప్రస్తావన వెలుగులోకి వచ్చింది.
‘ఎప్పుడైనా మీరు మీ అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చారా?’ అని యాంకర్ ప్రశ్నించగా, ‘ప్రతిరోజూ ఇస్తున్న గిఫ్ట్ గురించి చెప్పు’ అంటూ భాస్కర్ పలుకగా, ‘మోచేయి’ వరకు చూపిస్తూ మందు ఇచ్చినట్లుగా పలికారు. ఈ సందర్భంగా ‘అక్కడ మా ఆంధ్రాలో మందు బాలేదు’ అంటూ భాస్కర్ తండ్రి చెప్పే ప్రయత్నం చేసారు.
‘ఓయ్… చెప్పకయ్యా కొంపలంటుకుంటాయ్…’ అంటూ భాస్కర్ వారించినప్పటికీ, ‘మందు బాలేదు, నాకు నచ్చట్లేదు, అందులో తప్పేముంది చెప్పడానికి’ అంటూ భాస్కర్ తండ్రి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి ఏపీ మందు మ్యాటర్ అంటే మాములు విషయమా? ఆ మాత్రం హంగామా లేకపోతే ఎలా? అన్న రీతిలో సాగుతోంది.
Andhra Pradesh has just hit a major milestone, securing 2nd place in the National Panchayat…
Following the pan-India success of Kalki 2898 AD, Prabhas is now preparing for the much-awaited…