
ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై ఇంతలోనే ఓ వార్త ప్రభాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. సెంటిమెంట్స్ ను బలంగా విశ్వసించే సినిమా ఇండస్ట్రీలో ‘సాహో’ సెంటిమెంట్ ‘డార్లింగ్’ అభిమానుల పాలిట శాపంలా మారుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషలతో పాటు హిందీలోనూ రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు కూడా భాగస్వామ్యం కానున్నారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు జాకీ ష్రాఫ్ నటించిన మూడు తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద అణుబాంబులుగా మారతాయనుకుంటే, కనీసం అవి తాటాకు చప్పుడు కూడా చేయకుండా సైలెంట్ గా వెళ్ళిపోయాయి. మంచు విష్ణు నటించిన ‘అస్త్రం’ సినిమా ఒకటి కాగా, మిగతా రెండు స్టార్ హీరోలతో తెరకెక్కించిన పవన్ ‘పంజా’ మరియు ఎన్టీఆర్ ‘శక్తి’ చిత్రాలు. ఇవన్నీ అతి దారుణ పరాజయాలు చవిచూసాయన్న విషయం తెలియనిది కాదు. దీంతో ప్రభాస్ “సాహో” సినిమాలో జాకీ ష్రాఫ్ ఉన్నాడని వస్తున్న వార్తలు నిజం కాకపోతే బాగుండని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనేది రాజకీయంలో సర్వసాధారణం. అధికారం శాశ్వతం అనుకుని హద్దులు దాటి వ్యవహరిస్తే చివరికి చెల్లించే…
Telugu cinema has developed a habit of racing against time, especially when it comes to…