
బోడిగుండుకు మోకాలుకి ముడివేయడం అనే మాట తరచూ వినబడుతూనే ఉంటుంది. కానీ అదేమిటో.. ఎలాగో తెలియాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చెప్పిన ఈ మాటలు వింటే అర్దమవుతుంది.
“బనకచర్ల ప్రాజెక్టు కోసమే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుని పాడు పెట్టారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి తెలంగాణలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి నాడుచుకుంటుంటే కేంద్ర ప్రభుత్వం ఆయనకు సహకరిస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి ఆడగగానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు నివేదిక ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు సూచనల మేరకే రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కమీషన్ రిపోర్ట్ తయారు చేయించారు.
తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు వీరి ముగ్గురితో సమస్యలు తప్పవు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే అదే కాళేశ్వరం ప్రాజెక్టుతో మేము తెలంగాణకు మళ్ళీ నీళ్ళు పారిస్తాము,” అని జగదీష్ రెడ్డి అన్నారు.
ఇంకా కాగితాల మీద కూడా ఆమోదం పొందని బనకచర్ల ప్రాజెక్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టుని రేవంత్ ప్రభుత్వం పాడు పెడుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?
కాళేశ్వరం గురించి కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎంతో గొప్పలు చెప్పుకున్నారు. కానీ వారిని అదే ప్రాజెక్టుతో ప్రజల ముందు దోషులుగా నిలబెట్టబోతున్నారు సిఎం రేవంత్ రెడ్డి.
కనుక వారి ఆక్రోశం అర్దం చేసుకోవచ్చు. అందుకు వారు రేవంత్ రెడ్డితో, కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడి పైచేయి సాధించాలి కదా?
కానీ రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు పేరును, కాళేశ్వరం ప్రాజెక్టుతో కనపడని బనకచర్ల ప్రాజెక్టుని ముడిపెట్టి మాట్లాడుతుండటమే బోడి గుండుకు మోకాలితో ముడి వేయడం అంటే!
#Sardar2: Silly, Over-the-Top First Half! First half sticks to the plot without any deviations but…
October marks the beginning of the US federal fiscal year. The reset may restore the…