Telugu

వైసీపీ 2.0: స్మశానం నుంచి వేశ్యల నగరం..

రాబోయే రోజుల్లో జగన్ 2.0 చూడబోతున్నారు అంటూ వైసీపీ అధినేత వైస్ జగన్ చేస్తున్న రాజకీయ ప్రవచనాలను సాక్షి ఆచరణలోకి తీసుకువస్తుందా అన్నట్టుగా సాక్షిలో అమరావతి పై వైసీపీ 2.0 విష ప్రచారం మొదలయ్యింది.

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్ర రాజధాని అమరావతిని స్మశానం అని, వరద ముంపు ప్రాంతమని, నిర్మాణాలకు అనువైన భూమి కాదనని, అమరావతి కాదు భ్రమరావతి అంటూ, ఇది కమ్మ వారి కమరావతి అని, అమరావతి అసలు రాజధానే కాదని ఇలా రాజధాని అమరావతి పై వైసీపీ నుంచి సాక్షి వరకు తమ నీలి విషాన్ని చిమ్ముతూనే వచ్చారు.

ADVERTISEMENT

జగన్ ఆదేశాలకు అనుగుణంగా వైసీపీ నాయకులు కూడా రాజధాని అమరావతి పై నిత్యం అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తూ, అమరావతి పై, అక్కడి ప్రజల పై ఎప్పటికప్పుడు తమ వ్యతిరేకతను వ్యక్తపరుస్తూనే వచ్చారు. అక్కడి ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూనే వస్తున్నారు.

ఒకరు అమరావతి స్మశానం అంటూ విషం చిమ్మితే, మరొకరు అక్కడి ప్రాంత రైతులను పైడ్ ఆర్టిస్టులంటూ హేళన చేసారు. టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ‘దేవతల’ నగరంగా అభివర్ణిస్తే, వైసీపీ అధినేత జగన్ ఆత్మ సాక్షి లో అమరావతిని ‘వేశ్యల’ నగరంగా కించపరుస్తున్నారు.

జగన్ చెప్పిన 2.0 నినాదాన్ని వైసీపీ అమరావతి పై ప్రయోగించిందా అన్నట్టుగా సాక్షి డిబేట్ లో అమరావతి పై విశ్లేషకుల ముసుగులో కృష్ణరాజు అనే వ్యక్తి ఈ రకమైన కామెంట్స్ చేయడం, అందుకు సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది.

నాడు స్మశానం నుంచి నేడు వేశ్యల నగరం వరకు వైసీపీ అఘాయిత్యాలు, సాక్షి బరితెగింపులు హద్దులు దాటుతున్నాయే తప్ప తప్పు తెలుసుకోవడం లేదు. అమరావతి పై వైసీపీ కి ఎందుకింత ద్వేషం, సాక్షికి ఎందుకింత పగ.? కనీసం మహిళలను అగౌరవపరుస్తున్నాము అనే కనీస సృహ కూడా లేకుండా చేస్తున్న ఈ విమర్శలకు వైసీపీ ఇంకెంత మూల్యం చెల్లించాలి.?

నాడు అమరావతి పై హద్దులు దాటి విమర్శలకు దిగిన ఏ ఒక్క వైసీపీ నాయకుడు బొత్స నుంచి ఆర్కే వరకు, వైస్ జగన్ నుంచి సాక్షి వరకు అందరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో సరైన గుణపాఠం చెప్పారు. అయినా కూడా వైసీపీ కానీ సాక్షి కానీ ఇప్పటికి అదే ముర్కత్వంతో అమరావతి ని నాశనం చేస్తున్నాం అనే భ్రమలో తమ సొంత వైసీపీ పార్టీనే సమాధి చేస్తున్నారు.

రాష్ట్ర రాజధాని అంటే రెండు పార్టీల మధ్య జరిగే రాజకీయ యుద్ధం అనేలా వైసీపీ ఎప్పటికప్పుడు అమరావతిని చిదిమేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. రాజధాని అనేది ఇద్దరు అధినేతల నిర్ణయం కాదు, రెండు పార్టీల అభిప్రాయాలు కాదు, ఐదు కోట్ల ప్రజల భవిష్యత్, ఎన్నో ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్ర.

అధికారం చేతులు మారినప్పుడల్లా రాజధాని మారాలి, మారుస్తాం అంటూ వైసీపీ ఇదే రకమైన విధానాలతో ముందుకెళితే అసలు వైసీపీ అధికారం కోసం ఓటు అడిగే హక్కునే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. రాజధాని అంటే స్మశానమో, వేశ్యల నగరంలో కాదు రాజధాని అంటే ఒక రాష్ట్ర గుర్తింపు, రాష్ట్ర గౌరవం.

వైసీపీ విలువలు, జగన్ విశ్వసనీయత ఇప్పటికైనా సరైన మార్గంలో ఉన్నాయి అనుకుంటే సాక్షి, సాక్షి యాజమాన్యం నుంచి వైసీపీ, వైసీపీ అధిష్టానం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా అమరావతి ప్రాంత వాసులకు తక్షణమే క్షమాపణలు చెప్పి తీరాలి అనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Married Heroines & Intimate Scenes: Double Standards?

For decades, marriage was almost treated like a full stop in the careers of Indian…

6 minutes ago

Pics: Mahira Gives Black Fashion A Playful Twist!

Mahira Sharma gives the all black trend a fresh, flirtatious spin with a fitted crop…

26 minutes ago