
Kavitha Tests TRS Strength in Telangana MLC Elections
తెలంగాణలో కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్ మూడు పార్టీలు బలంగా ఉన్నాయి. ఇవి కాక వామపక్షాలతో సహా మరో అరడజను పార్టీలు కూడా ఉన్నాయి. కనుక తెలంగాణలో రాజకీయ శూన్యత లేదని స్పష్టమవుతోంది. కానీ ఉందని భావిస్తూ టీఆర్ఎస్ పార్టీతో కల్వకుంట్ల కవిత వచ్చారు. ఈ ఆరు నెలల్లో సభలు, ధర్నాలు, ప్రెస్‌మీట్స్ నిర్వహిస్తూ పార్టీ నిర్వహించేందుకు తగిన ఆర్థిక స్తోమత ఉందని నిరూపించుకోగలిగారు.
ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి తనకు ప్రజాధరణ ఎంత ఉంది? అని పరీక్షించుకోబోతున్నారు. త్వరలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. తొలిసారిగా వాటిలో టీఆర్ఎస్ అభ్యర్ధులను బరిలో దించుతున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి నలమాస శ్రీకాంత్ గౌడ్‌ను, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి ఆకాష్ కొల్లూరును అభ్యర్ధులుగా కవిత ప్రకటించారు.
అయితే ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజేపి మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కనుక, ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్ధులు తమ సొంత బలంతోనే నెగ్గాల్సి ఉంటుంది. ఒకవేళ వారు ఈ ఎన్నికల్లో గెలవలేకపోయినా, గట్టిగా ప్రయత్నిస్తారు కనుక మూడు ప్రధాన పార్టీల ఓట్లను చీల్చి నష్టం కలిగిస్తారు. కనుక వారి వలన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో ఏది ఎక్కువగా నష్టపోతుందనేది తెలుస్తుంది.
కనుక 2028 శాసనసభ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీకి ఇదొక చిన్న ట్రయల్ రన్ అని భావించవచ్చు. అప్పుడు వందల కోట్లు ఖర్చు చేసి నిలువునా మునిగిపోవడం కంటే, ఇలాంటి అవకాశాలు లభించినప్పుడు బలం ఎంతుందో టెస్టింగ్ చేసుకోవడం మంచిదే కదా?
Political differences often dominate election campaigns, but natural disasters demand a different approach. Andhra Pradesh…
ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు నదీ జలాలను అవసరమైన ప్రాంతాలకు పారించుకుంటూ చాలా సమర్ధంగా వాటర్ మేనేజ్‌మెంట్ చేస్తున్నారని, బీఆర్ఎస్…