Telugu

ఇదేమి లాజిక్ జగన్?

పాదయాత్రలో బిజీగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా రోజులతరువాత సాక్షి కాకుండా ఒక టీవీ ఛానల్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంధర్భంగా జగన్ ను పవన్ కళ్యాణ్ గురించి జనసేన పార్టీ గురించి, వైకాపా మీద ఎఫెక్ట్ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరంగా స్పందించారు.

ADVERTISEMENT

“జనసేన వల్ల కొత్తగా మాకు జరిగే నష్టమేమీ ఉండదు. పవన్ కళ్యాణ్ ను అభిమానించేవారు గత ఎన్నికలలోనే టీడీపీకు ఓటు వేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆయన చీలుస్తాడనేది అపోహ మాత్రమే” అని జగన్ చెప్పుకొచ్చారు. అయితే ఇందులో లాజిక్ ఏంటో అర్ధం కాలేదు. గత ఎన్నికలలో మోడీ, పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆయన చాలా సార్లు చెప్పారు.

అప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ టీడీపీకి ఉపయోగపడితే ఇప్పుడు మాత్రం ఎందుకు ఉపయోగపడదు? జగన్ పవన్ కళ్యాణ్ ను తక్కువ అంచనా వేస్తున్నారా? లేక బింకం ప్రదర్శిస్తున్నారా? పవన్ కళ్యాణ్ ను చూసి భయపడకపోతే ఎందుకు ఆ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పై తరచు విరుచుకుపడతారో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

NBK111: Balayya’s Return Has Become Crucial

Balakrishna’s NBK111 is heading towards a crucial phase. The film has already locked December 24…

25 minutes ago

OG 2: What Sujeeth Planned for Pawan Fans

Pawan Kalyan’s birthday is almost here, and OG 2 is naturally one of the projects…

55 minutes ago