తెలంగాణకు జగన్ దాతృత్వం

KCR_Jaganరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలతో పాటు గోదావరి – కృష్ణాలను అనుసంధానం చేసే ప్రాజెక్టు పై కూడా వారిద్దరూ చర్చించారని సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ పెట్టారు.

ADVERTISEMENT

తెలంగాణలో 18 వేల మంది పోలీసులను ఒకేసారి నియమిస్తున్న నేపథ్యంలో వారందరికీ ఏకకాలంలో శిక్షణ ఇచ్చేందుకు స్థలం చాలనందున 4 వేల మందికి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ ఇవ్వాలని జగన్‌ను కేసీఆర్ కోరారు. ఇందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

పోలీసులకు ఒకేసారి శిక్షణ ఇవ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కలగనుంది. దానితో కేసీఆర్ జగన్ కు థాంక్స్ చెప్పారని సమాచారం. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పొరుగు రాష్ట్రాలు మరీ ముఖ్యంగా తెలంగాణతో సఖ్యతతో మెలుగుతున్నారు. ఆ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

వీలైనంత తక్కువ భూసేకరణ, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని కూడా ఇరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి, అలైన్‌మెంట్‌ ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయ మార్గాలపై సీఎంలిద్దరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ADVERTISEMENT
Latest Stories