శభాష్ జగన్‌.. ఇలాగే కంటిన్యూ అయిపో!

జగన్‌ అమరావతిని వద్దనుకున్నారు. జనం ఆయనని వద్దనుకున్నారు. కనుక జనం ఏమి కోరుకుంటున్నారో జగన్‌కి అర్దమయ్యి ఉండాలి. కానీ కాలేదు.

అందుకే అంబటి రాంబాబు వంటి తన పార్టీ నేతల చేత, సోషల్ మీడియాలో అమరావతిపై విషం కక్కుతున్నారు. సరే అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది కనుక వద్దనుకున్నారు. పాడుబెట్టేశారు. ఫలితం అనుభవించారు.

ADVERTISEMENT

కానీ ఆ కారణంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా అమరావతిపై విషం కక్కుతుంటే వైసీపీకి లాభామా.. నష్టమా? అని ఒకసారి ఆలోచిస్తే వారికే తెలుస్తుంది కదా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు జగన్‌ నుంచి సంక్షేమ పధకాలు తప్ప మరేమీ ఆశించలేరు. కానీ చంద్రబాబు నాయుడు నుంచి అమరావతి, పోలవరం, రాష్ట్రాభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాలు ఆశిస్తుంటారు. ఆయన అదే చేస్తున్నారని ఏమాత్రం జ్ఞానం ఉన్నా అర్దమవుతుంది. కానీ వైసీపీకి ఎందుకు అర్దం కావడం లేదనేది ప్రశ్న!

చంద్రబాబు నాయుడుని, ఆయన చేసే ప్రతీ పనిని ద్వేషించాలి కనుక అమరావతిని ఇంకా ద్వేషిస్తున్నామని వైసీపీ నేతలకు తెలుసు. కానీ ప్రజలు కోరుకున్నవీ వారు ఊహించలేనివి కూడా సిఎం చంద్రబాబు నాయుడు చేసి చూపిస్తున్నప్పుడు, మనం ఈవిదంగా ఆయన గురించి, అమరావతి గురించి లేకిగా మాట్లాడుతుంటే ప్రజలు మనల్ని చీదరించుకోరా?అని వైసీపీలో ఎవరూ ఆలోచించిన్నట్లు లేదు.

మనం ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మించి తీరుతారు.. అభివృద్ధి చేసి చూపుతారని, వాటిని చూపి వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడుగుతారని వైసీపీకి తెలిసి ఉన్నప్పుడు, అయితే ఇప్పుడు మనం ఏవిదంగా ముందుకు సాగాలి?

ఏం చేస్తే ప్రజలను మెప్పించగలం? చంద్రబాబు నాయుడు కాదని మళ్ళీ మనకే ఓట్లు వేసేలా చేయగలం? కానీ మనం ఏం చేస్తున్నాం? మన విధానం సరైనదేనా కాదా? అని వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలి కదా?

కానీ చంద్రబాబు నాయుడుని రోజూ తిట్టిపోస్తూ, సోషల్ మీడియాలో ఆయనని రాక్షసుడుగా బొమ్మలు వేసుకుంటూ కాలక్షేపం చేస్తే, వాటిని చూసి ప్రజలు మనల్ని గెలిపిస్తారా? వచ్చే ఎన్నికలలో ప్రజలు మనకి ఎందుకు ఓట్లు వేయాలి? అసలు మనం ఏ కారణంగా గెలవగలం?అని కూడా వైసీపీలో ఎవరూ ఆలోచించినట్లు కనబడరు. కనుక అందరూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు.

వైసీపీ నేతల విమర్శలు, గోశాల రాజకీయాలతో కూటమి ప్రభుత్వానికి తాత్కాలిక ఇబ్బందులు ఎదురవుతూ ఉండొచ్చు. కానీ వైసీపీ అనుసరిస్తున్న ఈ విధానంతో చివరికి లాభపడేది కూటమే. ఈవిషయం సిఎం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు.

కనుకనే వైసీపీ రోజువారి ఎపిసోడ్స్‌ని ఎదుర్కొంటూనే తన పని తాను చేసుకుపోతున్నారు. కానీ ఈవిషయం వైసీపీ అధినేత జగన్‌ గ్రహించినట్లు లేదు.

వైసీపీ-కూటమి మద్య ఈ ఎపిసోడ్స్ ఇలా సాగిపోతుండగానే ఎన్నికల నాటికి అమరావతితో సహా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అభివృద్ధి కళ్ళకు కనబడుతుంది. అప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు వద్ద అనేక అస్త్రాలు ఉంటాయి. కానీ జగన్‌ వద్ద ఒక్క అస్త్రం కూడా ఉండకపోవచ్చు. బహుశః ఆయన వెంట నడిచేవారు కూడా ఎవరూ ఉండకపోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

So Many Rejections, Nani Must Be Cautious!

Nani's latest film The Paradise marked one of the most ambitious attempts of his career.…

4 minutes ago

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

34 minutes ago