Telugu

అన్న, చెల్లి, ఓ యలహంక ప్యాలస్…

వైఎస్ఆర్ మరణానంతరం ఆయన కుటుంబంలో వచ్చిన రాజకీయ కుదుపు ఒక సునామి అనే చెప్పాలి. అయితే ఆ సునామి నుంచి వైఎస్ కుటుంబం అతి త్వరగానే కోలుకోగలిగింది, బయటపడగలిగింది. కానీ 2019 ఏపీ ఎన్నికల తరువాత వచ్చిన సునామి ఇప్పటికి వైఎస్ కుటుంబాన్ని ఆ ఊబి నుంచి బయటకు రానివ్వడం లేదనే చెప్పాలి.

వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు పట్టలేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది. దీనితో ఇది మా వైఎస్ బ్రాండ్ అంటూ వైఎస్ఆర్ అభిమానులు, జగన్ శ్రోయోభిలాషులు కాలర్ ఎగరేశారు.

ADVERTISEMENT

అయితే వారికీ ఆ ఆనందాన్ని, సంతోషాన్ని ఎన్నో రోజులు మిగలనివ్వలేదు జగన్, షర్మిల. జగన్ గెలుపు కోసం అన్న వదిలిన బాణం లా రాష్ట్రమంతా తిరిగిన షర్మిల వైసీపీ అధికారంలోకి వచ్చిరాగానే నేను ఈడ పిల్లను కాదు అని అదే రాష్ట్రాన్ని విడిచివెళ్లాల్సి వచ్చింది.

అక్కడి నుంచి మొదలైన వైఎస్ కుటుంబ కథా చిత్రం ఒక్కో మలుపు తిరుగుతూ చివరికి తల్లి విజయలక్షి కి వ్యతిరేకంగా జగన్ కోర్ట్ లో కేసులు వేసే స్థాయికి వెళ్ళింది, అలాగే ఇటు చెల్లి షర్మిల పుట్టుకను అవమానించే స్థితికి దిగజారాయి. ఇలా నాడు ఒకటిగా ఉన్న వైఎస్ కుటుంబం ఇప్పుడు రాజకీయ విభేదాలతో, ఆస్తుల వివాదాలతో రోడ్డుకెక్కే పరిస్థితికి వచ్చేసారు.

ఇలా జగన్, షర్మిల మధ్య మొదలైన ఈ యుద్ధం వైఎస్ కుటుంబంలో మరో సునామీగానే చూడాలి. మరి ఈ సునామి నుంచి బయటపడేందుకు ఇటు జగన్ కానీ అటు షర్మిల కానీ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఈ ఇరువురు మధ్యలో యలహంక ప్యాలస్ మరో ప్రకంపనలు సృష్టిస్తుంది.

షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ వేడుకను బెంగళూర్ లోని యలహంక ప్యాలస్ ను ఎంచుకున్నారు షర్మిల. వివాహ వేడుక యలహంకా అంటూ ప్రముఖులను పెళ్లి పత్రికలు కూడా పంచేసారు షర్మిల. ఈ నేపథ్యంలో అంజలి పెళ్లి వేడుకకు యలహంక ప్యాలస్ ఇవ్వడం కుదరదని, తన భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అంటూ డియర్ షర్మిల అంటూ వైఎస్ జగన్ తన సోదరి షర్మిలకు లేఖ రాసారు.

ఇప్పుడా లేఖను వైసీపీ అధికారికంగా బయటకు విడుదల చేసింది. దీనితో సొంత మేనకోడలు పెళ్ళికి మేనమామ గా జగన్ ఇచ్చే పెళ్లి కానుక ఇదేనా అంటూ జగన్ వైపు వేలెత్తి చూపుతున్నారు విపక్ష పార్టీల నేతలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AOT: Ruhani Sharma in a Key Role as Bijili

Dulquer Salmaan is gearing up for his upcoming film Aakasamlo Oka Tara, which explores determination…

16 minutes ago

Ramayana Early Review Sparks Debate Over RRR and VFX

Nitesh Tiwari’s Ramayana is arriving on the big screen in a few more weeks, and…

33 minutes ago