
టిడిపి, వైసీపిల మద్య రాజకీయ వైరం ఆ రెండు పార్టీలకు సంబందించిన వ్యవహారం. కానీ దానిని రాష్ట్రానికి, ప్రజలకు సంబందించిన వ్యవహారంగా మార్చేసింది వైసీపి ప్రభుత్వం. 2024 ఎన్నికల నాటికి టిడిపిని అడ్డుతొలగించుకోవడానికి వైసీపి ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ళుగా చేయని ప్రయత్నాలు లేవు.
టిడిపి ముఖ్యనేతల ఆర్ధికమూలాలను దెబ్బ తీయడం, వారిపై కేసులు నమోదు చేసి వేధిస్తుండటం, టిడిపి కార్యాలయాలు, నేతలు, కార్యకర్తలపై భౌతికదాడులు, మూడు రాజధానుల పేరుతో అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్రా జిల్లాలలో ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం ద్వారా టిడిపిని రెండు ప్రాంతాలలో అడుగుపెట్టకుండా ప్రజల చేత తరిమి కొట్టించాలనుకోవడం, ఇప్పుడు వరుసపెట్టి కేసులు నమోదు చేయడం, చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టడం వరకు అనేక ప్రత్యక్ష ఉదాహరణలు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి.
అయితే టిడిపిపై రాజకీయ కక్ష సాధింపు కోసం వైసీపి ప్రభుత్వం అనేక కేసులు నమోదు చేయడమే కాకుండా వాటి కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అంతూపొంతూ లేని న్యాయపోరాటాలు కూడా చేస్తోంది. ప్రభుత్వోద్యోగులకు, ఉపాధ్యాయలకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోతున్నా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేకపోతున్నా ఈ కేసులు, న్యాయపోరాటాల కోసం మాత్రం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చుచేస్తుండటం చాలా శోచనీయం.
వైసీపి రాజకీయ కక్షల కోసం పోలీస్ వ్యవస్థను, రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని వాడుకొంటూనే ఉంది. వైసీపి రాజకీయ అవసరాల కోసం సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు సృష్టించి వాటి కోసం కూడా వందల కోట్ల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది.
అవి సరిపోన్నట్లు, అక్రమాస్తుల కేసులు, వివేకా హత్యకేసు, కోడికత్తి కేసులు, ఇప్పుడు ఈ రాజకీయ కక్ష సాధింపు కోసం కేసులు, వాటి కోసం న్యాయపోరాటాలు చేస్తూ ప్రజాధనం వాడుకోవడాన్ని వైసీపి ప్రభుత్వం ఏవిదంగా సమర్ధించుకోగలదు?ఈ భారం కూడా రాష్ట్ర ప్రజలే మోయాలా? వైసీపి రాజకీయకక్ష సాధింపు కోసం లేదా వైసీపి రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారా?
The protest of the Cockroach Janata Party, also called CJP, against Chief Election Commissioner Gyanesh…
బీజేపీ ఓట్ చోరీ అంటూ, సర్ ప్రక్రియ అప్రజాస్వామ్యం అంటూ ఇటు బీజేపీ పై అటు సీఈసీ జ్ఞానేశ కుమార్…