
Venkaiah Naidu Questions Vote Theft Claims
బీజేపీ ఓట్ చోరీ అంటూ, సర్ ప్రక్రియ అప్రజాస్వామ్యం అంటూ ఇటు బీజేపీ పై అటు సీఈసీ జ్ఞానేశ కుమార్ పై ఇండి కూటమి, సీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణల పై మాజీ బీజేపీ నాయకుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు.
గెలిస్తే క్రెడిట్ కోసం ఆరాటం, ఓడితే ఎలెక్షన్ కమిషన్ పై పోరాటమా.? అంటూ విపక్షాల విమర్శలకు తనదైన స్టయిల్ లో కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలలో తమ పార్టీ గెలిస్తే అది తమ ఘనత అని, ఓడితే ఈవీఎం ల దోషమని ప్రచారం చేయడం సరికాదన్నారు.
నిజంగా బీజేపీ ఓట్ చోరీకి పాల్పడితే దేశంలో ఉన్న అన్నీ రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వమే ఉండాలిగా.? అయినా ఎన్నికల సమయంలో ప్రజలు తాము ఎవరికీ ఓటేసామో చూసుకునే అవకాశం ఉన్నప్పుడు అసలు ఓట్ చోరీకి ఆస్కారం ఎక్కడుంది అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు వెంకయ్య.
రాజకీయాలకు సంబంధం లేని రాజ్యాంగ బద్దమైన వ్యవస్థలను రాజకీయాలతో ముడిపెట్టి విపక్షాలు చేస్తున్న ఈ తరహా రాజకీయం ప్రజాస్వామ్యానికి మంచిదికాదంటూ హితవు పలికారు వెంకయ్య నాయుడు. ఇదిలా ఉంటే నేడు ఇండి కూటమి నేతలు రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసి అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ చోరీ జరిగిందంటూ ఆరోపించారు.
హరియాణా, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, మధ్యప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందంటూ ముర్ముకు ఒక మెమోరాండం ఇచ్చారు. అయితే అటు తమిళనాడు, కేరళం, జార్ఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, తెలంగాణ లలో సైతం అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అక్కడ మాత్రం ఓట్ చోరీ గురించి ఇండి కూటమి నేతలు ప్రస్తావించలేదు.
అయితే ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్రపక్షలు అధికారంలోకి రావడంతో ఇండి కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగానే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావనను స్కిప్ కొట్టారా.? అంటూ బీజేపీ మద్దతుదారులు ఇండి కూటమి ఆరోపణల పై ఎదురుదాడి చేస్తున్నారు.
The protest of the Cockroach Janata Party, also called CJP, against Chief Election Commissioner Gyanesh…
Bigg Boss 20 has reportedly become the centre of another controversy. This time, the discussion…