వైసీపీ రాజకీయాలు కులాల నుంచి ఇప్పుడు మతాల వరకు వచ్చాయి. గత జగన్ ప్రభుత్వంలో ఏపీలో అనేక హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు, హిందూ మతం పై జరిగిన కుట్రల నేపథ్యంలో, తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వివాదంలో జగన్ హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడింది.
అయితే తన పై వచ్చిన ఈ ఆరోపణలకు చెక్ పెట్టేందుకుగాను జగన్ ఈ మధ్య తరచూ “హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్” అనే నినాదాన్ని అందుకున్నారు. అయితే నినాదాలతో ప్రజల నమ్మకాన్ని పొందాలనుకోవడం జగన్ అవివేకమే అవుతుంది.
నినాదాలలో మాత్రం హే రామ్ అని ఆచరణలో మాత్రం రావణ్ కి మద్దతు తెలిపితే అందుకు హిందూ సమాజం ఒప్పుకుంటుందా.? ప్రశ్న రావణ్…పేరుకు తగ్గట్టే ఆయన చేష్టలు కూడా కనిపిస్తున్నాయి. నాటి రావణ్ చర్యలు లంకాదహనానికి మార్గాలు వేస్తే నేటి ఈ రావణ్ ప్రశ్నలు వైసీపీ పతనానికి బాటలు వేస్తున్నాయి.
సోషల్ మీడియా యు ట్యూబర్ ప్రశ్న రావణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ గా చేసిన అనుచిత వ్యాఖ్యలకు, హిందూ మతం కేంద్రంగా చిమ్ముతున్న విషం కారణంగా అతని పై ఏపీలో పలు పీఎస్ లో కేసులు నమోదవుతున్నాయి. ఆయనకు వరుస బైళ్ల తో పాటుగా వరుస కేసులు కూడా ఉండడంతో ప్రశ్న రావణ్ అరెస్టు అనివార్యంగా మారింది.
తాజాగా కృష్ణ జిల్లా గన్నవరం పీఎస్ లో ఆయన పై BNS సెక్షన్ల తో పాటుగా UAPA చట్టం సెక్షన్లు 13, 39 కింద కేసులు నమోదు చేసారు. ప్రజల మధ్య విద్వేషాలు, ఘర్షణలు, రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అనే ఆరోపణలతో రావణ్ పై దేశ ద్రోహం కేసు నమోదయ్యింది.
అలాగే తెలంగాణ జర్నలిస్ట్ పేరుతో KVR ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. అయితే ఒక గౌరవ రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి పై KVR చేసిన వ్యాఖ్యలకు గాను KVR ని కూడా ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసారు.
అయితే వీరంతా రాజకీయ విమర్శల ముసుగులో సీఎం, డిప్యూటీ సీఎం ల పై పరుష పదజాలంతో బూతు రాజకీయాలు సాగిస్తున్నారు. ఇలా ఒకరు కులాల మధ్య ద్వేషాలు రెచ్చకొడితే మరొకరు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ ఏపీలో రాజకీయ అలజడికి ప్రణాళికలు వేస్తున్నారు.
వైసీపీ శ్రేణుల దృష్టిలో వారి మద్దతుదారుల ఉద్దేశంలో బూతు విమర్శలు రాజకీయ ప్రశ్నలుగా మారుతున్నాయి, వ్యక్తిగత దాడులు రాజకీయ విమర్శలలో భాగమైపోతున్నాయి. ప్రశ్న రావణ్ కానీ KVR కానీ బాబు, పవన్ ల మీద చేసిన విమర్శలు, అందుకు ఆ ఇద్దరు వాడిన పదజాలం సమాజం ఎన్నటికీ హర్షించదు.
కానీ అటువంటి వారికి మద్దతుగా, వారి అరెస్టులు అన్యాయమంటూ, అప్రజాస్వామ్యమంటూ జగన్ ప్రకటించడం రామ నామం జపించడమే అవుతుందా.? ఒకపక్క హే రామ్ అంటూనే మరోపక్క ఇటువంటి రావణ మూకకు జగన్ అండగా నిలవడం ఏపీ సమాజం హర్షిస్తుందా.? హిందూ దేవుళ్ళ మీద మాటల దాడులు చేసే రావణ్ కోసం జగన్ హే రామ్ అంటూ సానుభూతి చూపిస్తున్నారా.?
నిత్యం ఆంధ్రప్రదేశ్ పై విషం చిమ్మే KVR లాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ సేవ్ ఆంధ్రా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. జగన్ హే రామ్ … సేవ్ ఆంధ్రా వెనుక రావణ్ అనే ఒక సోషల్ మీడియా రాక్షసుడు, ఏపీ మీద విషం చిమ్మే ఒక సోషల్ మీడియా ఉన్మాది ఉన్నాడు. మరి వీరికి మద్దతుగా ముందుకొచ్చిన జగన్ కోసం రాముని భక్తులు, ఏపీ రాష్ట్ర ప్రేమికులు అండగా ఉంటారా.?




