Telugu

మర్యాద… మర్యాద… జైల్లో మర్యాద!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం కర్నూలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వెళ్ళారు.

ఎప్పటిలాగే ‘జనసంద్రం’ పోటెత్తింది. అది చూసి కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే గజగజా వణికిపోయిందట!

ADVERTISEMENT

కానీ ఒక ధర్మ సందేహం. జగన్‌ ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా ఆయన కోసం ప్రతీచోట అంత ‘జనసంద్రం’ పోటెత్తుతున్నప్పుడు, గత ఎన్నికలలో 11 సీట్లే ఎందుకు వచ్చాయి?

అంటే వాళ్ళందరూ ఓట్లు వేయలేదా?మరి అలాంటి ‘జనసంద్రం’ ఎంతగా పోటెత్తితే మాత్రం ఏం లాభం?ఓట్లుగా మారని చప్పట్లు, ‘జనసంద్రం’ని చూసి ‘మళ్ళీ మనమే’ అనుకుంటే నష్టం ఎవరికి?

జైలు వరకు ‘జనసంద్రం’ ఫాలో అవుతుంటే అద్భుతంగానే అనిపించింది. కానీ లోనికి వెళ్ళి వచ్చిన తర్వాత ‘మర్యాద.. మర్యాద…’ అంటూ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

జైలు నిబంధనల ప్రకారం కుర్చీలో కూర్చున్నప్పుడు తన ఫోటో తీసుకొని లోనికి పంపించాల్సి ఉండగా, జైలు సిబ్బంది కటకటాలకు అవతలివైపు నిలబడి తన ఫోటో తీసుకున్నారని జగన్‌ ఆరోపించారు.

తాను మాజీ సిఎంని అనే కనీస గౌరవం కూడా లేకుండా తనని అవమానించేందుకే వారు ఆవిధంగా చేశారని ఆరోపించారు. ఇది చంద్రబాబు నాయుడు శాడిజానికి నిదర్శనమని ఆరోపించారు.

కానీ జగన్‌ని అభిమానించే జైలు సిబ్బందిలో ఒకరు తన మొబైల్ ఫోన్‌తో అయన ఫోటో తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవం ఏమిటో జైలు అధికారులే చెప్పాలి.

మాజీ సిఎంకి కనీస గౌరవమర్యాదలు ఇవ్వాలని జగన్‌ స్వయంగా చెప్పారు కనుక ఇప్పుడు కొన్ని ప్రశ్నలు..

అయన సమక్షంలోనే శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుని అవమానించడం, అందుకు జగన్‌ ముసిముసి నవ్వులు నవ్వడం మర్యాదేనా?

నిబంధనల ప్రకారం ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోకుండా మాజీ సిఎంని అరెస్ట్ చేయడం సబబేనా?

చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ‘నేను విదేశాలలో ఉండగా పోలీసులు ఆయనని లేపేశారు’ అంటూ జగన్‌ ముసిముసి నవ్వుతూ చెప్పడం మర్యాదేనా?

తనకంటే వయసులో, అనుభవంలో పెద్దవారైన మాజీ సిఎం చంద్రబాబు నాయుడుని 55 రోజులపాటు జైల్లో నరకం చూపడం శాడిజం కాదా?

నేటికీ చంద్రబాబు నాయుడు చనిపోతారని, చనిపోవాలని బహిరంగంగా కోరుకోవడం శాడిజం కాదా?

జైల్లో ఫోటో తీసుకునే విషయంలోనే జగన్మోహన్ రెడ్డికి ఇంత కోపం, ఆవేశం, ఆవేదన కలుగుతున్నప్పుడు, అయన చేతిలో ఇన్ని అవమానాలకు గురైన సిఎం చంద్రబాబు నాయుడు మరెంత ఉండాలి?

‘జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించడానికి నాకు క్షణం పట్టదు. కానీ అలా చేస్తే నాకు అతనికి తేడా ఏముంటుంది?’ అని సిఎం చంద్రబాబు నాయుడు ఆయన పట్ల చాలా హుందాగా, మర్యాదగానే వ్యవహరిస్తున్నారు కదా?

అయినా మర్యాద సరిపోవడం లేదంటే? అయినా మనం ఇతరులకి మర్యాద ఇవ్వకుండా మర్యాద ఆశిస్తే లభిస్తుందా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rakul Breaks Silence And Sets The Record Straight

Rakul Preet Singh has broken her silence over reports linking her to an Income Tax…

20 minutes ago

IND vs WI T20Is: Where to Watch, Pitch Report & Playing XI?

India and West Indies will begin their five match T20I series on Tuesday, October 6,…

50 minutes ago