
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రకటనలు, ఒత్తిళ్ళు, ఆంక్షలు, అనుమతులపై ఎన్డీయేలో మిత్ర పక్షాలతో సహా దేశంలో విపక్షాలు స్పందిస్తుంటాయి.
తాజాగా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం, భారత్‌లో చమురు పరిస్థితి గురించి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అమెరికా… అధ్యక్షుడు ట్రంప్ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తూ చాలా చాకచఖ్యంగా వ్యవహరిస్తున్నారని మెచ్చుకున్నారు.
ముఖ్యంగా యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారానే సాధ్యమని ప్రధాని మోడీ సున్నితంగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
కానీ మాజీ సిఎంగా చేసి, శాసనసభలో ప్రధాన ప్రతిపక్షనాయకుడు హోదా ఇవ్వాలని పట్టుబడుతున్న జగన్మోహన్ రెడ్డి వీటి గురించి అసలు తెలియనట్లు ఉండిపోతున్నారు.
అలాగే ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు సిఎం మమతా బెనర్జీ ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారు. దీనిపై రాష్ట్రపతి ముర్ము కూడా అసహనం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం (సిఎం మమతా బెనర్జీ) తీరుని తప్పు పట్టారు. రాష్ట్రపతి వంటి అత్యున్నతమైన వ్యక్తికి సముచిత గౌరవ మర్యాదలు ఇవ్వడం అందరి బాధ్యత అని అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి అర్ధ నగ్నంగా నిరసనలు తెలిపినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. అప్పుడు జగన్ కూడా వారిని తప్పు పడుతూ ట్వీట్ చేశారు.
కానీ మళ్ళీ ఇప్పుడు రాష్ట్రపతికి అవమానం జరిగితే మౌనం వహించారు. అప్పుడు స్పందించడానికీ, ఇప్పుడు మౌనం వహించడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
జగన్‌కి దోస్త్ కేసీఆర్. ఆయనకు శత్రువు కాంగ్రెస్ పార్టీ. కనుక బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. కనుక జగన్ కూడా ఖండించారు.
జగన్‌కి దోస్త్ కేసీఆర్. ఆయనకు మమతా బెనర్జీ దోస్త్. కనుక బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. కనుక వైసీపీ కూడా స్పందించలేదు.
Mouli has become a familiar name through his social media work, web series and Little…
Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…