Telugu

పాపం జగన్‌! కృష్ణయ్య కూడా హ్యాండ్ ఇచ్చేశారుగా!

నేడు రాజ్యసభ అమరావతి బిల్లుకి ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లుపై జరిగిన చర్చలో బిజేపి ఎంపీ ఆర్‌ కృష్ణయ్య కూడా పాల్గొని “పవిత్ర భూమిలో రాజధానిగా అమరావతి వర్ధిల్లుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు అమరావతి నిర్మించడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించి ఆంధ్రప్రదేశ్‌ అద్భుతమైన రాజధానిగా అమరావతి ఏర్పడాలని మనసారా కోరుకుంటున్నాను. పార్టీలు, రాష్ట్రాలకు అతీతంగా అందరూ అమరావతికి మద్దతు తెలపాలి..” అంటూ దానికి ఉన్న సానుకూలతలను ఎంపీ ఆర్‌ కృష్ణయ్య వివరించారు.

ఆర్‌ కృష్ణయ్య బిజేపి ఎంపీ. అంతకు ముందు టీడీపి ఎమ్మెల్యే. కనుక అమరావతికి మద్దతుగా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఏపీలో టీడీపికి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయనను ఏపీకి రప్పించి రాజ్యసభ సీటు ఇచ్చారు. వైసీపీలో అనేకమంది బీసీ నాయకులు ఉండగా వారందరినీ కాదని కృష్ణయ్యని రప్పించి మరీ సీటు ఇచ్చారు.

ADVERTISEMENT

ఏపీ రాజకీయాల వలన ఈవిధంగా కూడా లాభిస్తుందని అప్పుడే కృష్ణయ్యకీ అర్దమైంది. పిలిచి పిల్లనిస్తానంటే ఎవరు కాదంటారన్నట్లు కృష్ణయ్య చాలా సంతోషంగా అప్పనంగా లభించిన ఆ సీటు తీసుకున్నారు.

అలా జగన్‌ వలన తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టిన కృష్ణయ్య, జగన్ తీవ్రంగా ద్వేషిస్తున్న అమరావతికి మద్దతు పలకడమే కాక ‘పుణ్యభూమి’గా అభివర్ణించారు. జగన్‌ విషయంలో దేవుడి స్క్రిప్ట్ ఎప్పుడూ ఇలాగే ఉంటుందేమిటో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీకి మళ్ళీ చేతి నిండా పని.. థాంక్యూ లోకేష్!

డీఎస్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్స్‌తో వైసీపీ చేతి నిండా పని కల్పించిన కూటమి ప్రభుత్వం, మరోసారి పని…

3 minutes ago

Allu Arjun Must Lock Sandeep Reddy Immediately?

Allu Arjun is one of the biggest stars in Indian cinema at this point in…

25 minutes ago