Telugu

అన్నా-చెల్లెళ్ళ బంధాలు, రాజకీయాలలో కూడా ఇంత సారూప్యతా?

ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒకే ఒక్క తేడా ఏమిటంటే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి అధినేత కాగా, బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్.

మిగిలిన అనేక విషయాలలో వాటి మధ్య చాలా సారూప్యత ఉండటం విచిత్రంగానే అనిపిస్తుంది. రెండు పార్టీల అధినేతలు శాసనసభ సమావేశాలకు హాజరు కారు. కనీసం ప్రజల మధ్యకు కూడా రారు. ఒకరు ఫామ్‌హౌసులో, మరొకరు ప్యాలస్‌లలో కాలక్షేపం చేస్తున్నారు.

ADVERTISEMENT

అయితే రాఖీలు కట్టిన చెల్లెమ్మల విషయంలో కూడా సారూప్యత ఏర్పడటం చాలా విచిత్రం. ఇద్దరు చెల్లెమ్మలు ఆస్తులు, రాజకీయ పదవుల కోసమే అన్నలతో విభేదించడమే విశేషమనుకుంటే, వారి అన్నలు కూడా చెల్లెమ్మలతో ఇంచుమించు ఒకే విధంగా వ్యవహరిస్తుండటం ఇంకా విచిత్రం.

వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి రెడ్డి పెళ్ళికి బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఇవ్వడానికి ప్రసక్తే లేదని జగన్ తేల్చి చెప్పడమే కాకుండా, వారు దానిలో అడుగు పెట్టకుండా కోర్టు నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు.

కనుక వైఎస్ షర్మిల తన కుమార్తె పెళ్ళిని బెంగళూరులోని ‘లీలా ప్యాలస్’కు మార్చుకున్నారు. అన్నా చెల్లెళ్ళ మధ్య బంధం పూర్తిగా చెడినందున జగన్ దంపతులు మేనకోడలి పెళ్ళికి హాజరయ్యే పరిస్థితి లేదు. కానీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా జగన్‌ రాజకీయ శత్రువులు అందరూ ఈ పెళ్ళికి హాజరు కాబోతున్నారు.

కల్వకుంట్ల కవిత ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూలో తన అన్న కేటీఆర్ గురించి కొత్త విషయం బయటపెట్టారు. కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేసే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా టీమ్ తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని, త్వరలో చనిపోబోతున్నానని పుకార్లు పుట్టించిందని ఆరోపించారు. ఏ అన్న కూడా చెల్లెలి పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ షర్మిల, వైఎస్ సునీతా రెడ్డి ఇద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డిపై ఇంచుమించు ఇటువంటి ఆరోపణలే చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ కాలకేయ సైన్యం తమ పట్ల చాలా అనుచితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ అన్నా-చెల్లెళ్ళ మధ్య సంబంధాలు చెడటం కుటుంబ వ్యవహారంగా మిగిలిపోయి ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ అది రాజకీయాలకు విస్తరించడంతో వారి గొడవలు ‘పబ్లిక్ టాపిక్’ అయ్యాయి.

అన్నల వల్ల రోడ్డున పడ్డ ఇద్దరు చెల్లెమ్మలు ప్రతీకార వాంఛతో రగిలిపోతున్నారు. ఈ క్రమంలో వారు తమ రాజకీయ ప్రత్యర్థులతో చేతులు కలపడం చాలా తప్పని వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని సుద్దులు చెప్పినప్పటికీ, తమ ఈ దుస్థితికి కారణమైన అన్నలను రాజకీయంగా దెబ్బ తీయడం కోసం అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవడం తప్పు కాదని వారు భావించడం సహజమే.

కనుక ఈ ఇద్దరు అన్నా-చెల్లెళ్ళ మధ్య ఆస్తుల కోసం మొదలైన ఈ యుద్ధాలు రాజకీయ యుద్ధాలుగా మారాయి. కనుక ఇవి వారి రాజకీయ ప్రత్యర్ధులకు అస్త్రాలుగా అందిస్తున్నాయి. కనుక వారు నలుగురితో పాటు వారి పార్టీలు కూడా దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పక పోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Tough Fight For Ravipudi This Sankranthi?

The Sankranti festival season usually features films across different genres, ranging from comedy and action…

26 minutes ago

Shraddha’s Marathi Diction Draws Criticism

Portraying a character on screen is not just about changing one's appearance to match the…

57 minutes ago