
Jagan and KTR Face Political Pressure
జగన్, కేటీఆర్ ఇద్దరు కూడా తమ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు చేస్తున్న రాజకీయాలు పార్టీకి బలంగా మారాల్సింది పోయి పార్టీని ప్రజల ముందు మరింత పలుచన చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల విషయానికొస్తే సీఎం రేవంత్ వేసిన రాజకీయ ఉచ్చులో కేటీఆర్ తనకు తానుగా వచ్చి చిక్కుకోవడమే కాకుండా కేసీఆర్ ని కూడా ఇరికించారనే చెప్పాలి.
కల్వకుంట్ల ఆస్తుల చిట్టా అంటూ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ వేసిన రాజకీయ ఉచ్చులో కేటీఆర్ తానూ గా వచ్చి ఇరుక్కున్నారు. కేసీఆర్ పుట్టుకతోనే భూస్వామి అని, ఆయనకున్న ఈ ఆస్తులన్నీ కూడా ఎన్నికల అఫడవిట్ లో పొందుపరిచినవే అంటూ చేసిన వ్యాఖ్యలు, అందు కోసం ఇచ్చిన ప్రకటనలు కేటీఆర్ తో పాటుగా బిఆర్ఎస్ ను ఆత్మరక్షణలో పడేశాయి.
ఇక కేసీఆర్ కుటుంబానికి హైద్రాబాద్ లో ఉండేందుకు సరైన ఇల్లు కూడా లేదంటూ కేటీఆర్ చేసిన ప్రకటనలకు రేవంత్ హైద్రాబాద్ లో ఉన్న కేటీఆర్ స్టార్ హోటల్స్ ల లిస్ట్ బయటపెట్టారు. దీనితో కేటీఆర్ డిఫెన్స్ లో పడ్డారు. కేసీఆర్ కి సొంత ఇల్లు లేదు కానీ కేటీఆర్ కి మాత్రం వందల కోట్ల విలువైన స్టార్ హోటల్స్ ఉన్నాయి అంటూ ‘కల్వకుంట్ల పేద కుటుంబ దీనగాధలు’…అంటూ కాంగ్రెస్ బిఆర్ఎస్ ని సోషల్ మీడియా వేదికగా గట్టిగా ట్రోలింగ్ చేస్తుంది.
ఇక ఇటు ఆంధ్రా పాలిటిక్స్ విషయానికొస్తే ఇక్కడ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం పై క్రెడిట్ చోరీ అంటూ ఆరోపించిన ప్రతిసారి వైసీపీ కూడా సోషల్ మీడియాకు ఆహారంగా మారుతూనే వస్తుంది. గతంలో ఆయా అంశాల గురించి జగన్ చేసిన ప్రకటనలు ఇప్పుడు ఆ క్రెడిట్ మాదే అంటూ వాదిస్తున్న తీరు రెండు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది.
తద్వారా జగన్ తో పాటుగా వైసీపీ నేతలు కూడా సోషల్ మీడియాకు ఆహారంగా మారుతున్నారు. తమ విమర్శలతో, ఆరోపణలతో ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలని చూసిన ప్రతి సారి అటు కేటీఆర్ ఇటు జగన్ ఇద్దరు కూడా ఒకే స్థితిలో సోషల్ మీడియాకు ఆహారంగా మారుతున్నారు.
ఇప్పటికే కల్వకుంట్ల భూముల పై విచారణ అంటూ రేవంత్ కేసీఆర్ ఫామ్ హౌస్ గడప వరకు వచ్చేసారు. ఇటు కూటమి ప్రభుత్వం కూడా జగన్ సొంత నియోజకవర్గ ప్రజల దశాబ్దాల నీటి సమస్యకు చెక్ పెడుతూ పులివెందుల వరకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు కేటీఆర్, జగన్ కూడా తమ ప్రత్యర్థి పార్టీల దూకుడు రాజకీయాలకు చెక్ చెప్పలేకపొతే అటు కూటమి ఇటు రేవంత్ ఆడుతున్న రాజకీయ ఆటలో అరటిపండు అవ్వకతప్పదేమో…!
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వానికి రాజకీయంగా రోజురోజుకి గడ్డుపరిస్థితులు ఎదురవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ ల భారం ఒక…
Following the failure of Coolie, Rajinikanth is all set to return with his next release,…