
జగన్ రాజధానిగా అమరావతికి బదులు మావిగన్ అంటూ ప్రకటించిన నాటి నుంచి కూడా ఆ పార్టీలోని కాపునేతలందరూ మావిగన్ ప్రచార బాధ్యతలను పంచుకుంటున్నారు. అంబటి రాంబాబు తో మొదలైన ఈ ప్రయాణం పేర్ని నాని నుంచి, బొత్స, ధర్మాన ఇప్పుడు గుడివాడ అమర్నాధ్ వరకు వ్యాపించింది.
వీరిలో ఒకరు రోజుకోసారి మీడియా ముందుకొచ్చి మావిగన్ ను ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజల ముందు నవ్వులపాలవుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో బూతులతో రెచ్చిపోయిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎక్కడ.? విజయవాడ లోని కీలక ప్రాంతమైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎక్కడ.?
అలాగే జగన్ ప్రకటించిన మావిగన్ మచిలీపట్టణం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు ఉంది. అయితే ఇందులో భాగమైన మచిలీపట్టణం నుంచి మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని బయటకొచ్చి జగన్ ప్రతిపాదించిన మావిగన్ కు మద్దతు తెలిపారు.
ఇక గుంటూరు నుంచి తాజాగా కాపు టైగర్ గా జగన్ దగ్గర ప్రశంసలు పొందిన అంబటి రాంబాబు మావిగన్ కు ఓటేశారు. మరి మావిగన్ లో భాగమైన విజయవాడ నుంచి వైసీపీ నేతలు జగన్ ప్రకటించిన మావిగన్ మీద పెదవి విప్పలేకపోతున్నారు వై.?
విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, లో వైసీపీ తరుపున పోటీ చేసి కూటమి చేతిలో చిత్తుగా ఓడిన వెల్లంపల్లి, దేవినేని అవినాష్, అసిఫ్ షేక్ నేతలు ఇప్పుడెక్కడున్నారు.? వారెందుకు జగన్ ప్రకటనకు తానా తందానా అనడం లేదు. ఇటు ప్రభుత్వం చట్టం చేసిన అమరావతిలో, అటు జగన్ ప్రతిపాదించిన మావిగన్ లో కీలక ప్రాంతమైన విజయవాడ కు సంబంధించిన వైసీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు.
వారెందుకు జగన్ మావిగన్ కోసం మీడియా ముందుకు రావడం లేదు. ఇప్పటికే జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఇక్కడ వైసీపీ నేతలు రాజకీయంగా భారీ మూల్యమే చెల్లించారు. మరోసారి కూడా జగన్ ప్రకటనలకు బహిరంగ మద్దతులు ప్రకటిస్తూ వారి రాజకీయ భవిష్యత్ ని సమాధి చెయ్యలేకే విజయవాడ వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారా.?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…