
మాట తిప్పను మడమ తిప్పానని మరిచిపోకుండా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డే సమైఖ్యాంద్ర నుంచి విశాఖ రాజధాని వరకు అనేక అంశాలపై మాట తప్పుతూనే ఉన్నారు… మడమ తిప్పుతూనే ఉన్నారు. మీరేమీ సాధించాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మాటకు కట్టుబడి ఉంటే చాలు… తప్పో ఒప్పో తర్వాత తేల్చుకోవచ్చని వైసీపీ నేతలు, కార్యకర్తలు అనుకోకుండా ఉంటారా జగన్ మావిగన్ అన్నాక!
ప్రముఖ జర్నలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, “మీరు చెప్పిన ప్రకారమే మూడు రాజదానులకే కట్టుబడి ఉన్నాం. కనుక అమరావతిని మేము వ్యతిరేకిస్తున్నామని ఖరాఖండీగా చెప్పవచ్చు. పార్లమెంటులో ఈ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాలి.
లేదా యస్ రాజధాని విషయంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ మా అభిప్రాయాన్ని మార్చుకున్నాం. అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నామని చెప్పొచ్చు. తద్వారా మీ వైఖరి ప్రజలకు అర్ధమవుతుంది.
కానీ అమరావతికి వ్యతిరేకం కాదంటూనే అమరావతి బిల్లుని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ నుంచి వాకవుట్ చేస్తారు! అమరావతికి వ్యతిరేకం కాదంటూనే ప్లాన్-బీ.. మావిగన్ అనే మరో కొత్త ప్రతిపాదన చేస్తారు. కానీ రాజధాని విషయంలో స్పష్టత లేకుండా ఇలా మాట్లాడుతూ ప్రజలకు మీరు తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి పద్దతి ఎలా ఉందంటే నా మాటకి నేను కట్టుబడి ఉండను. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించనన్నట్లుంది. దీని వలన రాజకీయంగా వైసీపీఏ నష్టపోతుందని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.
కొత్తగా సినిమాలలోకి వచ్చిన నటీనటులు నలుగురి ముందు డాన్స్ చేసేందుకు తడబడతారు. కానీ జగన్ రాజకీయాలకు కొత్త కాదు. వచ్చి రెండు దశాబ్దాలు కావస్తోంది. పైగా 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కానీ నేటికీ వైసీపీని ఓ రాజకీయ పార్టీలా కాకుండా, చంద్రబాబు నాయుడుని ద్వేషించడమనే బేసిక్ ప్రిన్సిపల్ ఆధారంగా నడిపిస్తుంటారు.
బండి సంజయ్ నడవాలంటే పెట్రోల్ అవసరం. అదేవిధంగా వైసీపీ చంద్రబాబు నాయుడుపై ద్వేషమనే పెట్రోల్‌తో నడుస్తుంటుంది. ఇలాంటి ఫార్ములాతోనే నడిచిన తెలంగాణలోని గులాబీ బండి ప్రస్తుతం గ్యారేజీలో ఉంది. ఇక్కడ ఫ్యాను రెక్కలు కూడా అందుకే విరిగాయి కదా? కానీ మారకపోతే ఎవరికి నష్టం?
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…