Telugu

ఈవీఎం ట్యాపరింగ్: వైసీపీ భ్రమలు తొలగవా.?

ఏపీలో ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయిపోయింది, ఇందులో కూటమి విజయాన్ని, వైసీపీ పరాభవాన్ని జగన్ ఇప్పటికి అంగీకరించలేకపోతున్నారు. తన పార్టీ ఓటమికి తన నియంత పాలన, కక్ష్య రాజకీయాలే కారణాలు అనే వాస్తవాన్ని జగన్ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు.

ఈవీఎం ల ట్యాపరింగ్ ఫలితంగానే కూటమి ఈ స్థాయి విజయాన్ని, వైసీపీ ఇంతటి పరాజయాన్ని చూడాల్సి వచ్చింది అనే భావన నుంచి వైసీపీ బయటకు రాలేకపోతుంది, అలాగే ప్రజలను కూడా అదే భ్రమలో ఉంచాలని ప్రయత్నిస్తుంది.

ADVERTISEMENT

ఇందుకు గాను వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని బృందం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. ఈవీఎంల పై తమకున్న అనుమానాలను మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు.

గత ఎన్నికల సమయంలో చివరి గంటలో భారీ పోలింగ్ జరిగిందని, అదంతా ఈవీఎం ల ట్యాపరింగ్ కారణంగానే జరిగిందంటూ వైసీపీ పదేపదే తమ వాదనను తెరమీదకు తెస్తుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ చేరుకున్న వైసీపీ నేతలు ఆ చివరి గంటలో నమోదయిన పోలింగ్ శాతానికి సంబంధించిన పూర్తి వివరాలు తమకు అందచేయాలంటు విజ్ఞపి చేసారు.

అసాధారణంగా ఓటర్లు పెరిగిపోవడం పైన కూడా వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇందుకుగాను కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ఎంపీ మిథున్ రెడ్డి, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, లోకేష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో మరికొందరు వైసీపీ శ్రేణులు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసారు.

అలాగే ఈవీఎం లపై తమకున్న టెక్నీకల్ అనుమానాలన్నీ వివరిస్తూనే ముఖ్యంగా బాలకృష్ణ పోటీ చేసిన హిందూపూర్ లోని పూలింగ్ బూత్ 150 లో జరిగిన ఓటింగ్ వివరాలను కూడా వెల్లడించాలంటూ ఎన్నికల సంఘం అధికారులను కోరారు సుబ్బారెడ్డి.

అలాగే వైసీపీ చాల బలంగా ఉన్న స్థానాలలో కూడా కూటమి ఘన విజయాలను సాధించడం పై కూడా వైసీపీ నేతలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైసీపీ సాంకేతిక సలహాదారుగా పనిచేసిన లోకేష్ రెడ్డి నకిలీ ఓట్ల పేరుతో హంగామా చేసాడు, కానీ ఈసీ అలాంటిదేమి జరగలేదు అంటూ నిర్దారించింది.

అప్పట్లో రాష్ట్ర ఓటర్ల జాబితాలో ఉన్న మొత్తం 3.69 కోట్ల పేర్లలో 59 లక్షల పైగా అంటే దాదాపు 16 శాతం చెల్లనవి, నకిలీవి అని లోకేష్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈసీ మాత్రం ఈ వాదనలు అబద్దమని, ఆ స్థాయిలో చెల్లని, నకిలీ పేర్లు లేవంటూ ధ్రువీకరించింది.

ఈవీఎం ల ద్వారా ప్రజా తీర్పుని ట్యాపరింగ్ చేసే ప్రమాదం ఉందని, దానికి బదులు బ్యాలట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ పదేపదే ఈ అంశాన్ని హై లైట్ చేస్తుంది. అయితే 2019 ఎన్నికలలో 151 స్థానాలలో వైసీపీ ఊహించని విజయాన్ని అందుకున్నప్పుడు మాత్రం ఇది చారిత్రాత్మక విజయం,

టీడీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, జగన్ ప్రభంజనం అంటూ జబ్బలు చరిచిన వైసీపీ ఇప్పుడు కూటమి విజయాన్ని, వైసీపీ ఓటమిని ఈవీఎం ట్యాపరింగ్ అంటూ కొట్టిపారేయలేని చూస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యి ఏడాది గడిచిపోయినప్పటికీ వైసీపీ ఇప్పటికి ఈవీఎం ల ట్యాపరింగ్ అనే భ్రమ నుండి తానూ బయటకు రావాలని చూడడం లేదు, ప్రజలను ఆ మాయలోనే ఉంచాలనే ప్రయత్నాలు మానుకోవడం లేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

6 hours ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

7 hours ago