ఎగ్గొట్టిన బకాయిలు “అంతంత మాత్రం” కాదు సుమీ..!

మంచి చేసి ఓడిపోయాం, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి నష్టపోయాం, సిద్ధం సభలకొచ్చిన ప్రజాదరణ చూసి మోసపోయాం అంటూ ఓటమి మీద ముసలి కన్నీళ్లు కారుస్తూ, కుంతీ సాకులు వెతుక్కుంటున్న వైసీపీ నేతలకు వారి ఓటమికి గల కారణాలలో ఒకదాని మీద ఇప్పుడు విశ్లేషణ వివరిద్దాం.

అప్పులు చేసి హామీలు, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి సంక్షేమం, బకాయిలు ఎగ్గొట్టి బహిరంగ సభలు నిర్వహించి ఇంకా ఓడిపోయాం, మోసపోయాం, నష్టపోయాం అంటూ జగన్ అండ్ కో ప్రజలను ఏమార్చాలని చూస్తున్నారే తప్ప చేసిన తప్పులను ఒప్పుకోవడం లేదు, చేయాల్సిన బాధ్యతను నిర్వర్తించడం లేదు.

ADVERTISEMENT

వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ అవస్థలు పడుతూనే వచ్చాయి. అభివృద్ధిని పక్కన పెట్టి, మౌలిక వసతులను మంటకలిపి, బకాయిలు పేరబెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఖజానాను పూర్తిగా ఖాళీ చేసారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు వైసీపీ భాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే వస్తున్నాయి.

తాజాగా వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్ ఎగ్గొట్టిన బకాయిల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన తండ్రి వైస్సార్ చేతుల మీదుగా ఆవిష్కరించిన ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా జగన్ నిర్వీర్యం చేసేసారు. పేదల ఆరోగ్య భద్రతగా భావించే ఆరోగ్య శ్రీ పథకానికి గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయల బకాయిలు ఎగ్గొట్టింది.

అలాగే విద్యార్థుల జీవితానికి వారి భవిష్యత్ కు సంబంధించిన ఫీజ్ రీయింబర్స్ మెంట్ పథకానికి జగన్ మామ ఎగ్గొట్టిన మొత్తం 3500 కోట్లు. ప్రచార ఆర్భాటాల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే గుడ్డు, చిక్కీల కాంట్రాక్టర్ కు 178 .5 కోట్లకు బిల్లు పెండింగ్లో ఉంచారు. అలాగే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీల మోత మోగించిన జగన్ 1 . 29 లక్షల కోట్లు బకాయిలు పెట్టారు.

ఇక కాంట్రాక్టర్ల బకాయిలు 28 వేల కోట్లు కాగా, ధాన్యం కొనుగోలు బకాయిలు 1678 కోట్లు, ఫైనాన్స్ బిల్లులు 19549 కోట్లు, ఉద్యోగుల బకాయిలు 21980 కోట్లుగా లెక్కతేలినట్లు తెలుగు దేశం పార్టీ తన సోషల్ మీడియాలో ప్రకటించింది. గత ఐదేళ్లు జగన్ మంచి చేసి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తన పాలనారాహిత్యంతో, ధనదాహంతో ఒక్కో వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు వేడుక చూస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్.

జగన్ తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిన అప్పులు, పెట్టిన బకాయిలు “అంతంతమాత్రం” కాదు అనేది స్పష్టమయింది. దీనితో151 సీట్లతో 2019 తో తొడకొట్టిన వైసీపీని 11 సీట్లతో తలెత్తుకోకుండా చేసారు ఏపీ ప్రజానీకం. ఇన్నాళ్లు అప్పులతో ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీ బకాయిలతో పాలన ముగించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి కళ్ళు మూసుకుంటే సరిపోతుంది కదా అంటూ సర్ది చెప్పుకుంటున్నారు.

ఒక మాజీ ముఖ్యమంత్రి నుండి ఇటువంటి ప్రకటనలు రావడం అంటే జగన్ బాధ్యత రాహిత్యం అంతంత మాత్రం కాదు, ఆయన నిర్లక్ష్యం అంతంత మాత్రం కాదు, ఆయన అవినీతి, అక్రమాలు అంతంత మాత్రం కాదు అనేది తేలిపోయింది. కానీ వైసీపీ విధానాలతో, జగన్ ఆలోచనలతో ఏపీ ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రం గానే మిగిలిపోయిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

38 minutes ago

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…

41 minutes ago