జనసేన: జగన్ చెపుతున్న అభివృద్ధి ఇదేనా..!

జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రము అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, అన్నింటిలో మనమే నెంబర్ వన్, ఆదాయంలోనూ మనదే ప్రధమ స్థానం అంటూ ప్రయివేట్ విద్యాసంస్థల మాదిరి ప్రచారాలు చేసుకునే వైసీపీ కి జనసేన ఒక్క కరెంట్ బిల్లుతో సమాధానం చెప్పింది.

ADVERTISEMENT

అవును జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి జరగక పోయినా అప్పులతో పాటుగా ఆదాయం కూడా విపరీతంగా పెరిగింది. అదెలా సాధ్యమయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి అంటూ…., ఒక వినియోగదారుని కరెంట్ బిల్లుని సోషల్ మీడియాలో షేర్ చేసింది జనసేన శతఘ్ని టీం. దీనితో అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఆ వినియోగదారునికి తన వాడకం ద్వారా వచ్చిన అసలు కరెంట్ బిల్లు కేవలం 105 రూపాయలు. అయితే ప్రభుత్వం డెవలప్ మెంట్ చార్జీల పేరుతో ఆ వినియోగదారునికి అదనంగా వేసిన చార్జీలు అక్షరాలా 4068 రూ. ఈ బిల్లు కట్టాలని లేకపోతే మీ వసతులకు కరెంట్ నిలిపి వేస్తామని అధికారులు బెదిరించడంతో సదరు వ్యక్తి ఆబిల్లు మొత్తాన్ని చెల్లించడం జరిగిందంటూ జనసేన శతఘ్ని టీం సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసింది.

ఇలా రాష్ట్రం లో లేని అభివృద్ధి పేరిట ప్రజల నుండి అదనపు చార్జీలను వసూళ్లు చేస్తూ, విచక్షణా రహితంగా ప్రజల పై చెత్త పన్ను , ఆస్తి పన్ను, నీటి పన్ను అంటూ సామాన్యుడి నడ్డి విరుస్తూ ఒక పక్క, మందుబాబుల బలహీనతలను ఆసరాగా చేసుకుని గతంతో పోలిస్తే నాలుగింతలు మద్యం రేట్లు పెంచి తమ ఆదాయాన్ని పెంచుకుంటూ మరో పక్క, ఓట్ల కోసం వచ్చిన ఆదాయాన్ని పంచుకుంటూ మా హయాంలో రాష్ట్ర ఆదాయం పెరిగింది అంటూ జబ్బలు చరుచుకుంటున్న ప్రభుత్వాన్ని ఏమనాలి..?

అటువంటి ప్రభుత్వానికి మద్దతుగా నిలబడే వారిని ఎలా నిందించాలి..? ఇదేనా పేదవాడికి పెత్తందారులకు మధ్య జరిగే పోరు..? ఈ పోరులో పేదవాడు ఎవరు.? పెత్తందారులు ఎవరు..? అనేది జావాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. అభివృద్ధి కాగితాలలో వచ్చే బిల్లులలో కాదు సార్ పేదవాడి బతుకులో చూపించాలి అంటున్నారు జనసైనికులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mrunal Thakur Says No, But What Is She Waiting For?

Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…

12 minutes ago

Rohit Back as MI Cap? Truth Behind Big Rumours

Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…

42 minutes ago