Telugu

జగన్ ‘విలువలు’ ఇలా ఉంటాయా.?

వైసీపీ కి బలంగా మారాల్సిన జగన్ ప్రెస్ మీట్లు ప్రజలలో వైసీపీ ని మరింత పలుచన చేస్తున్నాయి. విలువలు – విశ్వసనీయతే వైసీపీ పునాదులు అని చెప్పుకునే వైఎస్ జగన్ విలువలు ఏ పాటివో ఆయన ప్రెస్ మీట్లు చూస్తే యిట్టె అర్ధమవుతుంది అంటున్నారు సామాన్య ప్రజానీకం.

పదేపదే ఒక వ్యక్తి మరణం గురించి మాట్లాడడం, ఆయన వయస్సుని వేలెత్తి చూపుతూ ఆయన రాజకీయాలలో చివరి అంకానికి వచ్చారంటూ ఎద్దేవా చేయడం జగన్ విలువలకు నిలువెత్తు నిదర్శనం గా కనిపిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ కి అలాగే బాబు కి జగన్ రాజకీయ ప్రత్యర్థులే కావచ్చు.

ADVERTISEMENT

అంతమాత్రాన పదేపదే జగన్, బాబు వయసు 75 కి వచ్చింది, బాబు కి ఇవే చివరి ఎన్నికలు, ఆయనకు మావిగన్ పేరు చెపితే బీపీ వచ్చి గుండెపోటుతో చనిపోతారేమో అంటూ బాబు మరణం పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.

గతంలో కూడా జగన్ ఇదే విధంగా 75 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకెన్నాళ్లు ఈ రాజకీయాలు కృష్ణా – రామ అంటూ ఇంట్లో కూర్చోక అంటూ సీఎం బాబు ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయాలలో గెలుపోటములు సర్వసహజం, అలాగే అధికార – ప్రతిపక్షాల మధ్య రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితమయ్యి ముందుకెళితే అవి రాష్ట్రాభివృద్ధికి సహాయపడుతుంది.

కానీ జగన్ మాదిరి ఇలా ఒక వ్యక్తి చావుల మీద రాజకీయాలు చేస్తే వాటిని విలువలతో కూడిన రాజకీయాలు అంటారా.? జగన్ ఇలా పదేపదే బాబు చావు మీద ఎందుకు మాట్లాడుతున్నారు.? ఇటువంటి వ్యాఖ్యలు వారి కుటుంబానికి బాధను కలిగించవా.? వారి పార్టీ శ్రేణులకు బీపీలు తెప్పించవా.?

దేశ ప్రధాని నరేంద్ర మోదీ వయసు కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. అలాని జగన్ మోదీని మీకు వయసు అయిపోతుంది, ఇంకెన్నాళ్లు ఇటువంటి రాజకీయాలు చేస్తారు.? కృష్ణా రామ అంటూ ఒక చోట కూర్చోక ఇలా విదేశీ పర్యటనలు ఎందుకు.? ప్రధాని పదవి ఎందుకు అంటూ ప్రశ్నించగలరా.?

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, బాబు కూడా అటుఇటుగా ఒకే వయసు వారు. అటువంటి కేసీఆర్ గెలుపు కోసం జగన్ బిఆర్ఎస్ కు తెరచాటు రాజకీయ సాయాలు చెయ్యవచ్చు కానీ బాబు మాత్రం గుండెపోటు తో చనిపోవాలని కోరుకుంటారా.? ఇదేనా జగన్ చేస్తున్న విలువలతో కూడిన రాజకీయం.?

వైసీపీ ప్రభుత్వ హయాంలో బాబు అరెస్టు సందర్భంగా కూడా పలు వైసీపీ నాయకులు, నాడు మంత్రులుగా, మాజీ

మంత్రులుగా ఉన్న నేతలు సైతం బాబు మీద ఆయన చావు మీద నీచమైన వ్యాఖ్యలు చేసారు, ఆతరువాత దాని ఫలితం అనుభవిస్తున్నారు.

జగన్ ఇప్పటికి ప్రజలు వైసీపీ ని ఎందుకంత దారుణంగా తిరస్కరించారో గ్రహించక ఇప్పటికే అదే తరహా రాజకీయాలు చేస్తూ విలువలు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్ చేస్తున్న ఈ తరహా రాజకీయం ఏదోనాడు వైసీపీ ని పూర్తిగా రాజకీయ సమాధి చేసేస్తుంది.

తల్లిని గౌరవించలేక, చెల్లిని ప్రేమించలేక, బాబాయ్ కి న్యాయం చెయ్యలేక, ప్రత్యర్థి పార్టీల నేతల చావులు కొరుకుంటూ జగన్ వైసీపీ 2.0 వస్తుంది, జగన్ 2.0 ని చూస్తారు అంటూ పార్టీ శ్రేణుఅల్ను ఉద్దేశిస్తూ ఇస్తున్న నిందలు కూడా ‘వై నాట్ 175’ మాదిరే ఫలితాలను అందిస్తాయని గ్రహించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Anirudh’s Paradise Failure Now Haunts Jailer 2 Hopes

Recently, the much-anticipated interview of Jailer with its cast and crew took place, during which…

35 minutes ago

CJP Leaders Released as Delhi Tightens Security

Three Cockroach Janata Party (CJP) leaders detained ahead of a protest demanding the resignation of…

1 hour ago