
ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసులతో, అరెస్టులతో, దాడులతో ప్రతిపక్షాలను అణిచివేసిన వైసీపీ నేడు సుద్దపూస కబుర్లు వల్లెవేస్తూ, రాజకీయా ప్రవచనాలు చెపుతూ అధికార, ప్రభుత్వ చర్యలను తప్పుబడుతుంది.
ప్రతిపక్షంలో ఉండి కూడా మా పార్టీ నేతలను మీ పార్టీ ఎమ్మెల్యేల, మంత్రుల ఇళ్లకు పంపించి హత్యలు చేసే కార్యక్రమాలు చేపడితే అంటూ ఒక మాజీ ముఖ్యమంత్రి , ఒక పార్టీ అధినేత ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను, అధికార యంత్రాగాన్ని సవాల్ చేస్తున్నారు.
గతంలో మా పార్టీ కార్యకర్తలకు బీపీలొచ్చాయి అంటూ టీడీపీపార్టీ కార్యాలయాల మీద దాడిని సమర్ధించిన వైస్ జగన్, నేడు మా పార్టీ శ్రేణులు మీ ఇళ్లకు వచ్చి హత్యలు చేస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతికి ఉంటుందా.? అంటూ పరోక్షంగా వైసీపీ క్యాడర్ ను హత్యా రాజకీయాల వైపు ప్రేరేపిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో, ప్రత్యర్థుల దాడులతో, బూతు రాజకీయాలతో నీచ స్థాయికి దిగజారాయి. ఇక ఇప్పుడు జగన్ నోట వెలువడిన ఈ హత్యా రాజకీయ కార్యక్రమం వైసీపీ కార్యకర్తలను ఏ స్థాయికి దిగజారుస్తుందో, రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తుందో కాలమే బదులు చెప్పాల్సి ఉంటుంది.
జగన్ పరామర్శల పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతూ తెస్తున్న రప్ప రప్ప నరుకుతాం అనే పోస్టర్లు ఓ పక్క, అరిచే కుక్కల మాదిరి కాదు కరిచే కుక్కల మాదిరి చీకట్లో కన్నుకొట్టి లేపేయాలి, పొద్దున్నే వెళ్లి పరామర్శించాలి అంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న రెచ్చకొట్టే వ్యాఖ్యలు మరో పక్క రాష్ట్రంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తుంటే,
తాజాగా జగన్ మావాళ్లు, మీ ఎమ్మెల్యే, మంత్రుల ఇళ్లకు వెళ్లి హత్యలు చేస్తే ఏంటి పరిస్థితి అంటూ చేస్తున్న వ్యాఖ్యలు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు పార్టీ శ్రేణులను రెచ్చకొట్టే ప్రక్రియలో భాగమా.? లేక ప్రభుత్వాన్ని బెదిరించే చర్యలా.? లేక అధికారులను హెచ్చరిస్తున్న విధానమా.?
ఇలా బహిరంగంగా జగన్ చేస్తున్న ఈ హత్యా రాజకీయ ప్రకటనలు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చే కుట్రలో భాగమనుకోవాలా.? ఇటువంటి వ్యాఖ్యలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి అభివృద్ధిని అటకెక్కేంచెందేందుకు వైసీపీ వేస్తున్న ప్రణాళికలా.? జగన్ బయటకొస్తూనే అంటే రాష్ట్రంలో ఏదొక అలజడి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
నాడు బీపీలోచ్చాయి దాడులు చేసారు అందులో తప్పేముంది అన్న జగన్ నేడు ఫ్రస్టేషన్ వచ్చింది హత్యలు చేస్తున్నారు అందులో న్యాయముంది అంటూ సమర్ధించనున్నారా.? వైసీపీ గత చరిత్ర చూసినా జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్యా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డి కి జగన్ క్లిన్ చిట్ ఇచ్చి మరోసారి ఆయనకు కడప ఎంపీగా అవకాశం ఇచ్చారు.
అలాగే అనంతబాబు తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను దారుణంగా హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పటికీ ఆయనను వైసీపీ ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించకపోగా అనంతబాబుని జగన్ వెంటేసుకుని తిరిగిన దృశ్యాలు ప్రజలందరూ చూసారు.ఇవన్నీ కలిసే వైసీపీ ని 151 నుంచి 11 కి పడేశాయి.
ఇలా వైసీపీ అధినేత నుంచి వైసీపీ కింద స్థాయి సిబ్బంది వరకు ప్రభుత్వాన్ని ఈ స్థాయిలో రెచ్చకొడుతున్నా, బెదిరిస్తున్నా, హెచ్చరిస్తున్నా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగానే ఉండదలచుకుందా.? లేక ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రభుత్వంగా మారి తన చర్యలతో ఇటువంటి నాయకుల నోటికి తాళం వేయనుందా.?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…