సింహానికి… జెడ్ ప్లస్ భద్రత కావాలట!

హిందూ దేవతామూర్తులకు అనేక పేర్లు ఉన్నట్లే, ఏపీ మాజీ సిఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికీ అనేకం ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఆయన సొంతంగా పెట్టుకున్నావే.. మిగిలినవి అభిమానులు, గిట్టనివారు పెట్టినవి. ఆయన సొంతంగా పెట్టుకున్నవాటిలో సింగిల్ సింహం, ఏనుగు, అర్జునుడు, శ్రీకృష్ణుడు వంటివి ఉన్నాయి.

ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ వారి తోడేళ్ల గుంపులను సింగిల్ సింహంలా ఎదుర్కొని చీల్చి చెండాడేస్తానని జగన్‌ గొప్పగా చెప్పుకున్నారు. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయని వాటిని చూసి ఏనుగు భయపడదంటూ తనని తాను ఏనుగుతో పోల్చుకున్నారు.

ADVERTISEMENT

అభిమన్యుడు పద్మవ్యూహం ఛేదించడంలో ఫెయిల్ అయ్యాడేమో కానీ అర్జునుడు వంటి తాను ఎన్నడూ ఫెయిల్ అవనని చెప్పుకున్నారు. కానీ అయ్యారు. చంద్రబాబు నాయుడు శిశుపాలుడు వంటివారని తాను శ్రీకృష్ణుడు వంటి వాడినని జగన్‌ చెప్పుకుంటారు.

ఎన్నికల ప్రచారంలో ఇన్ని ప్రగల్భాలు పలికిన జగన్‌, ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో తాడేపల్లి ప్యాలస్‌ చుట్టూ 12 అడుగుల ఎత్తైన ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. ప్యాలస్‌లో నుంచి బయటకు వస్తే దారిపొడవునా పరదాలు కట్టించుకునేవారు. బటన్ సభలు జరిగే చోట చుట్టూ పక్కల పచ్చటి చెట్లు నరికించేసే వారు. గజినీలా అవన్నీ మరిచిపోయి సింగిల్ సింహం, ఏనుగు, అర్జునుడు అంటూ ఏవేవో మాట్లాడేవారు.

అధికారంలో ఉన్నప్పుడే సింగిల్ సింహం ప్రాణ భయంతో ఉన్నప్పుడు, అధికారం కోల్పోయాక ఆ భయం మరింత పేరుగుతుందే తప్ప తగ్గదు కదా? అందుకే సింహానికి జెడ్ ప్లస్ భద్రత కావాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తన భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కనుక సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీ కమెండోలతో తనకు జాడ ప్లస్ క్యాటగిరీ భద్రత కల్పించాలని కేంద్రాన్ని ఆదేశించాలని జగన్‌ కోరారు.

కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి కనుక రాష్ట్ర ప్రభుత్వం సుమారు 190 మందితో 24X7 భద్రత కల్పిస్తోంది. నేటికీ ఆయన 10-20 కార్ల కాన్వాయ్‌తో తిరుగుతుంటారు. అయినా భద్రత సరిపోవడం లేదని సింహం భయపడుతోంది.

ఈ కేసులో కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శి, ఇంటలిజన్స్ బ్యూరో డైరెక్టర్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డీజీ, సీఆర్‌పీఎఫ్ డీజీ, రాష్ట్ర డీజీ, రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. కనుక హైకోర్టు వారందరికీ నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కోరింది. వేసవి సెలవులు అనంతరం ఈ కేసు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

సింహానికి ప్రాణభయం ఉందని ఈ కేసుతో స్పష్టమైంది కనుక అంతవరకు తాడేపల్లి ప్యాలస్‌లో నుంచి బయటకు రాకపోవచ్చు. ఇంతకీ సింహం ఎవరిని చూసి భయపడుతోందో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

21 minutes ago

GV Prakash’s Big Bollywood Test

GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…

50 minutes ago