Telugu

జగన్‌ లండన్‌కి.. కేసీఆర్‌ అమెరికాకి.. నేతలు జైలుకి?

బిఆర్ఎస్ పార్టీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రావడం లేదు. లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్‌ మెడకు చుట్టుకునేలా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలపై ప్రభుత్వం కమీషన్లు వేసి విచారణ జరిపిస్తోంది. అవి కూడా కేసీఆర్‌ మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.

ADVERTISEMENT

ఫార్ములా 1 రేసింగ్ వ్యవహారం కేటీఆర్‌ మెడకు చుట్టుకోబోతోంది. కనుక 2024 బిఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్‌ కుటుంబానికి వెరీ వెరీ బ్యాడ్ ఇయర్! అలాగే జగన్‌, వైసీపీలకు కూడా!

సరే..2024 ఎలాగూ బాగోలేదు కనుక కనీసం 2025 అయినా బాగుండాలని కోరుతూ కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో యాగాలు చేశారు. కానీ 2024లో మొదలైన ఈ కష్టాలు 2025లో కూడా కొనసాగేలా కనిపిస్తున్నాయి. ఫార్ములా 1 రేసింగ్ కేసులో ఏసీబీ, ఈడీ పోటాపోటీగా కేసీఆర్‌ మీద కేసులు నమోదు చేశాయి.

రెండూ విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపాయి. ఈ కేసులో సోమవారం ఉదయం తమ ముందు విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కి ఏసీబీ నోటీస్ పంపగా, మంగళవారం తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ ఈడీ కూడా నోటీస్ పంపింది.

ఆయనతో పాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు అర్వింద్‌ కుమార్‌, బీఎల్ఎన్‌ రెడ్డిలకు కూడా రెండు దర్యాయపపత్తు సంస్థలు నోటీసులు పంపాయి.

‘ఇదో లొట్టిపిట్ట కేసు’ అని కేటీఆర్‌ ఎంత తేలికగా కొట్టి పడేసినా కేసు నమోదు అయ్యింది కనుకనే ఆయన హైకోర్టుని ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ తీసుకోవలసి వచ్చిందికదా?

ఏసీబీ నుంచి కేటీఆర్‌ తప్పించుకున్నా ఈడీ నుంచి తప్పించుకోవడం కష్టమే. ఒకవేళ ఆయన లోపలకు వెళితే కేసీఆర్‌ బయటకు వస్తారా లేదా?

సంక్రాంతి తర్వాత జనం మద్యకు వస్తానని చెప్పిన జగన్‌ లండన్ బయలుదేరుతున్నట్లే, కేసీఆర్‌ కూడా అమెరికా బయలుదేరుతారా?

వెళితే ఇక్కడ వైసీపీ, అక్కడ బిఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఏమిటి?అని ఆలోచిస్తే 2025 కూడా రెండు పార్టీలకు ఆగమ్యగోచరంగానే కనిపిస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana Release Date is Confirmed!

Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…

27 minutes ago

Hanuman Ansh Telugu Flops: What Went So Horribly Wrong?

Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…

1 hour ago