
వైసీపీ ఓటమి తో ఆ పార్టీ క్యాడర్ పూర్తి నైరాశ్యంలోకి ఆ పార్టీ లీడర్లు పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సమయంలో జగన్ పరామర్శలు, ఓదార్పులు అంటూ పాత రాజకీయానికి “రప్ప రప్ప” అనే కొత్త హంగులు దిద్ది పార్టీకి తిరిగి జీవం పొసే ప్రయత్నాలు మొదలుపెట్టారు, అందులో జగన్ కొంత సక్సెస్ కూడా అయ్యారు.
అయితే గతంలో జగన్ చేసిన ఓదార్పు యాత్రలు బాధితులకు అండగా ఉండడానికి జరిగితే నేడు జగన్ చేస్తున్న పరామర్శలు కొత్త బాధితులను సృష్టించేలా సాగుతున్నాయి. జగన్ బయటకొస్తున్నారు అంటే అయితే వైసీపీ క్యాడర్ కేసులు పెట్టుకుని లోపలికి వెళ్లడం లేదంటే ఆ పార్టీ మద్దతుదారులు ఎదో ఒక ప్రమాదానికి లోనవ్వడం జరుగుతుంది.
మొన్న జగన్ పరామర్శ యాత్రకు గాను రప్ప రప్ప అంటూ వైసీపీ క్యాడర్ పోస్టర్లతో రెచ్చిపోయి తలో రెండు కేసులను వెనకేసుకోగా, ఇక నిన్న సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ కారు టైర్ కింద నలిగి ప్రాణాలు కోల్పోతే, మరో జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా వైసీపీ శ్రేణులకు తలకు గాయాలయ్యాయి.
అంటే వైస్ జగన్ ఎదో ఒక కారణంతో బయటకు వస్తున్నారు అంటే అటు పోలీస్ అధికారులకు కొత్త తలనొప్పులతో పాటు ఇటు పార్టీ శ్రేణులకు కూడా లేనిపోని ఆపదలుఎదురవుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన మరో వైసీపీ సౌమ్యుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ని రేపు సెంట్రల్ జైలుకెళ్లి పరామర్శించనున్నారు జగన్.
అందుకుగాను జగన్ నెల్లూరు పర్యటన షెడ్యూల్ ను వైసీపీ విడుదల చేసింది. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకున్న జగన్ కాకినితో ములాఖత్ లో పాల్గొననున్నారు. అటు పిమ్మట కాకాని కుటుంబసభ్యుల ఓదార్పు యాత్రలో పాల్గొని మరో వైసీపీ మంచివాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ని కలవనున్నారు.
టీడీపీ మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి కి కూడా రేపు జగన్ పరామర్శ దక్కనుంది. అయితే జగన్ యాత్రలకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినా అధికారుల ఆదేశాలను మాత్రం వైసీపీ శ్రేణుల నుంచి వైసీపీ అధినేత జగన్ వరకు భేఖాతరు చేస్తున్నారు.
హెలిపాడ్ వద్ద 10 మందికి మించి అనుమతి లేదు అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్న వైసీపీ మాత్రం 100 ల మందితో బలప్రదర్శనకు దిగుతూ అటు జగన్ భద్రత పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, అధికారులు అలసత్వం చూపిస్తున్నారు అంటూ ఎదురుదాడి చేస్తున్నారు.
అలాగే అధికారులను సైతం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ అందరి లెక్క సరిచేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ చేస్తున్న ఈ రెచ్చకొట్టే రాజకీయానికి వైసీపీ పరామర్శ..ఓదార్పు అంటూ నామకారణం చేసి చంపుతాం నరుకుతాం అంటూ రెచ్చిపోతుంది.
అలాగే తన రెచ్చకొట్టే రాజకీయంతో సొంత పార్టీ క్యాడర్ ను బలితీసుకుంటుంది. ఈ నేపథ్యంలో రేపు జగన్ నెల్లూరు పర్యటనలో వైసీపీ బలప్రదర్శన యాత్రలో బలికాబోతున్న ఆ వైసీపీ సిబ్బంది ఎవరు అనే ప్రశ్న సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనితో జగన్ బయటకొస్తున్నారహో…జాగ్రత్త అనే పోస్టర్లు సిద్ధం చెయ్యాలేమో బహుశా…!
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…