Telugu

అమరావతి చరిత్రలో జగన్‌ స్థానం ఏమిటి?

స్వాతంత్ర్య పోరాటాల గురించి చెప్పుకుంటే దానిలో తప్పక కాంగ్రెస్‌ పార్టీ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్ర గురించి చెప్పుకుంటే మాజీ సిఎం కేసీఆర్‌ పేరు అగ్రస్థానంలో ఉంటుంది.

మరి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చరిత్రలో ఎవరి పేరు ఉంటుంది? అంటే ఈ ఆలోచనకు ప్రాణం పోస్తున్న సిఎం చంద్రబాబు నాయుడు, ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుంటున్న ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల పేర్లు అగ్రస్థానంలో ఉంటాయి.

ADVERTISEMENT

స్వాతంత్ర్యం కోసం పోరాడిన కోట్లాది ప్రజలెవ్వరు? తాజ్ మహల్‌కి రాళ్ళెత్తిన కూలీలెవరూ?అంటే అనామకమూర్తులు చాలా మందే ఉంటారు. వారి ఊర్లు, పేర్లు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ వారి త్యాగఫలాలే మనం అనుభవిస్తున్నామని అందరూ అంగీకరిస్తారు.

అదేవిధంగా అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కాంట్రాక్ట్ కంపెనీలు, వాటి ఇంజనీర్లు, కార్మికుల పేర్లు కూడా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ వారూ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములుగా అమరావతి చరిత్ర పుటలలో నిక్షిప్తం అవుతారు.

కానీ అమరావతి చరిత్రలో మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు స్థానం ఏమిటి? అంటే దానిని అడ్డుకొని పాడుబెట్టిన చరిత్ర హీనులుగా ఎప్పటికీ నిలిచిపోతారు. అమరావతి చరిత్రలో కటప్పగా జగన్‌, కాలకేయ సైన్యంగా వైసీపీ నేతలు మిగిలిపోతారు.

నేడు శాసనసభ ప్రత్యేక సమావేశంలో జగన్‌ బ్యాచ్ కూడా పాల్గొని అమరావతిని రాజధానిగా చేస్తున్న తీర్మానానికి బేషరతుగా మద్దతు ఇచ్చి చేసిన తప్పుని సరిదిద్దుకోవచ్చు. కానీ ఈ చివరి అవకాశాన్ని కూడా వారు కాలదన్నుకున్నారు. ఎందుకంటే వారిలో ఎటువంటి పశ్చాతాపం లేదు కనుక!

హైదరాబాద్‌ హైటెక్ సిటీ, ఐటి కంపెనీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు, ఇండియన్ బిజినెస్ స్కూల్ వంటివి ప్రస్తావనకు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తుంటుంది. అది వర్తమాన చరిత్ర అనుకుంటే, మరో 100-200 సంవత్సరాల తర్వాత ఎవరైనా అమరావతి చరిత్రని తిరగేస్తే, దానిలోనూ చంద్రబాబు నాయుడు పేరు ప్రధానంగా కనిపిస్తుంది.

అమరావతి చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తప్పక ఉంటుంది. ప్రపంచ చరిత్రలో గాంధీజీ, హిట్లర్ పేర్లు శాశిత్వతంగానే ఉంటాయి. అలాగే ఇదీను!

జగన్‌ మొహం కూడా చూడని భవిష్యత్‌ తరాలు కూడా ఆయన అమరావతికి చేసిన ద్రోహం గురించి తెలుసుకొని అసహ్యించుకోకుండా ఉంటాయా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

8 hours ago

AK47 New Date: Trivikram About to Break His Promise?

After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…

8 hours ago