జగన్‌, చంద్రబాబు: తేడా ఇదే!

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపి, జనసేన అధినేతలని ఎంతగానో అవహేళన చేసేవారు. ఆ పార్టీల నేతలు, కార్యకర్తలను పోలీసులతో వేధిస్తుండేవారు.

వారు ఆయనకి రాజకీయ శత్రువులు కనుక వేధించేవారని సరిపెట్టుకున్నా, రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులను కూడా జగన్‌ విడిచిపెట్టలేదు.

ADVERTISEMENT

సరే! వారందరిపై ‘కమ్మ ముద్ర’ వేసి కక్ష తీర్చుకున్నారనుకున్నా, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను, ప్రభుత్వోద్యోగులను, చివరికి ఉపాధ్యాయులను కూడా విడిచిపెట్టలేదు.

రాష్ట్రంలో అందరికీ మేలు చేస్తున్ననంటూనే చెత్తపన్ను వేసి సామాన్య ప్రజలను కూడా పీడించారు. ఈ ఆకృత్యాల జాబితాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పుకోవాలంటే ఓ పుస్తకమైనా వ్రాయాలి లేదా రాంగోపాల వర్మతోనే సినిమా అయినా తీయించాలి.

రాష్ట్రంలో రాజకీయ పార్టీలని అమరావతి రైతులను, సామాన్య ప్రజలను పీడించారు సరే! పొరుగు రాష్ట్రానికి చెందిన పెద్ద మనిషి సూపర్ స్టార్ రజనీ కాంత్‌ని కూడా విమర్శించాల్సిన అవసరం ఏమిటి? అంటే ఓ కార్యక్రమంలో ఆయన చంద్రబాబు నాయుడు గురించి రెండు మంచి మాటలు చెప్పడమే ఆయన చేసిన పాపం.

రజనీ కాంత్ ఒక్క దక్షిణాది రాష్ట్రాలలోనే కాక జపాన్, సింగపూర్ వంటి దేశాలలో కూడా వీరాభిమానులున్న ఏకైక నటుడు. అలాంటి గొప్ప నటుడు, వయసులో తన కంటే చాలా పెద్దవారైన రజనీ కాంత్‌ని వైసీపీ నేతల చేత అవహేళన చేయించారు. వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తమ పైశాచికానందానికి అవధులు లేవని నిరూపించుకున్నారు.

రజనీ కాంత్‌ సినీ పరిశ్రమలో 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా ఆయనకు అభినందనలు తెలియజేశారు.

“సూపర్‌స్టార్ రజనీకాంత్ గారికి సినీ రంగంలో 50 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. తన విశిష్టమైన కెరీర్‌లో ఆయన లక్షలాది మందిని తన ఐకానిక్‌ నటనతో కేవలం అలరించడమే కాకుండా, తన చిత్రాలను సామాజిక చైతన్యానికి వేదికగా కూడా ఉపయోగించారు.

సమాజంలో తక్షణ పరిష్కారం కావాల్సిన అంశాలపై ఆలోచన రేకెత్తించే విధంగా ఆయన కృషి నిలిచింది. అర్థవంతమైన, ప్రేరణనిచ్చే పాత్రలతో అనేక మందికి జీవితానికి ఒక దిశను చూపించారు. ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను,” అంటూ ఆయనతో దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు.

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగడం ఎవరైనా గొప్పనుకుంటారు. కానీ ఆయన రజనీ కాంత్‌తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి ఆయన పట్ల గౌరవం చాటుకున్నారు.

చూశారా…. జగన్‌, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేశారు. కానీ ఇద్దరి ప్రవర్తనలో ఎంత తేడా ఉందో!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

1 hour ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

2 hours ago