‘స్పైడర్’ ఫెయిల్… ‘జై లవకుశ’ సక్సెస్..!

Jai Lava Kusa - Lava Teaser Talk Perfect Set Up For Kusaదసరా వార్ కు సిద్ధమైన రెండు బడా సినిమాలు ప్రిన్స్ మహేష్ బాబు “స్పైడర్” మరియు జూనియర్ ఎన్టీఆర్ “జై లవకుశ” సినిమాలకు సంబంధించి ఇప్పటివరకు రెండు టీజర్లు విడుదలయ్యాయి. రెండు సినిమాలకు సంబంధించిన మొదటి టీజర్ ‘ఇన్ స్టంట్ హిట్’ కాగా, రెండవ టీజర్ విషయంలో మాత్రం తేడా కొట్టింది. మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘స్పైడర్’ రెండవ టీజర్, ఏకంగా సినిమాపైనే నెగటివ్ భావాలను వ్యక్తపరిచేదిగా మిగిలిపోగా, అందుకు విరుద్ధంగా తాజాగా విడుదలైన ‘జై లవకుశ’ రెండవ టీజర్ ఉందని చెప్పాలి.

‘లవకుమార్’ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన రెండవ టీజర్ అంచనాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. నిజానికి ‘జై’ వంటి నెగటివ్ పాత్ర తర్వాత, ఎన్టీఆర్ ఎలా కనిపించినా మెప్పించడం కష్టం అన్న టాక్ వెలువడిన నేపధ్యంలో… సరిగ్గా ‘జై’కు అపోజిట్ గా కనిపించిన ‘లవకుమార్’ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాడు. మంచితనానికి ‘బ్రాండ్ అంబాసిడర్’గా నిలిచే పాత్రలో ఎన్టీఆర్ వైవిధ్యం అదిరిందనే చెప్పాలి. అలాగే ‘మంచితనం… అది పుస్తకాలలో ఉంటే పాఠం అవుతుంది… మనలో ఉంటే గుణపాఠం అవుతుంది…’ అంటూ ఎన్టీఆర్ పలికిన డైలాగ్ వెంటనే కనెక్ట్ అవుతుంది.

ADVERTISEMENT

ఇక ఎన్టీఆర్ లుక్స్ తర్వాత ఈ టీజర్లో బాగా ఆకట్టుకునే అంశం…. దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం. ‘జై’ పాత్రకు ‘రావణా…’ అంటూ పవర్ ఫుల్ మ్యూజిక్ ను అందించగా, ‘లవకుమార్’ పాత్రకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని అందించి అదరగొట్టాడు. ఈ రెండు పాత్రలు పరిచయం అయిన నేపధ్యంలో… మూడవ పాత్ర ‘కుశ’ ఎలా ఉంటుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. బాబీ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 21వ తేదీన విడుదల చేయనుండగా… ఈ రెండు టీజర్లను బట్టి ఈ దసరాకు జూనియర్ ఎన్టీఆర్ హవా స్పష్టంగా కొనసాగే సంకేతాలు కనపడుతున్నాయి. ‘జై లవకుశ’ అనేది ‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ కు ‘ఐ ఫీస్ట్’ ఏమో..!

ADVERTISEMENT
Latest Stories