దసరా కంటే ముందు ‘వినాయకచవితి’ వార్ షురూ!

Jai Lava Kusa Vs Spyder‘స్పైడర్’ ఫస్ట్ టీజర్ సాధించిన రికార్డులను ‘జై లవకుశ’ మొదటి టీజర్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ‘స్పైడర్’ రెండవ టీజర్ మాత్రం ‘జై లవకుశ’ రికార్డుల దరిదాపుల్లోకి వెళ్ళలేకపోయిందన్నది వాస్తవం. అంచనాలను అందుకోవడంలో దారుణంగా విఫలమైన ‘స్పైడర్’ రెండవ టీజర్ స్థానంలో మరో టీజర్ ను వినాయకచవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లుగా ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

‘స్పైడర్’ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు గానీ, తాజాగా ‘జై లవకుశ’ రెండవ టీజర్ మాత్రం వినాయకచవితికి విడుదల చేయనున్నామని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తేదీ మరియు సమయాన్ని త్వరలో చెప్తామని చేసిన ట్వీట్ ‘యంగ్ టైగర్’ అభిమానుల్లో అప్పుడే పండగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. ‘జై’ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ లోనే అందరినీ పడేయడంతో, ‘లవ’ ఎలా ఉంటాడో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పోస్టర్స్ లో సాఫ్ట్ గా, చాలా క్లాస్ గా కనిపించడంతో ఎన్టీఆర్ కు మరో డిఫరెంట్ ఇమేజ్ ను తెచ్చిపెట్టేది ఈ పాత్ర కనపడుతోంది.

ADVERTISEMENT

ఇక ‘స్పైడర్’ కూడా తన టీజర్ గానీ, ట్రైలర్ విషయంలో గానీ స్పష్టత ఇస్తే… దసరా కంటే ముందు వినాయకచవితి వార్ షురూ అవుతుంది. ప్రస్తుతానికి అయితే ‘జై లవకుశ’పై అంచనాలు తక్కువ, నమ్మకాలు ఎక్కువగా ఉండగా, ‘స్పైడర్’పై అంచనాలు ఎక్కువ, విజయం సాధిస్తుందన్న నమ్మకాలు తక్కువగా వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రభావం టీజర్స్ క్లిక్స్ విషయంలో స్పష్టంగా కనపడింది. మరి చివరికి బాక్సాఫీస్ వద్ద ఎవరు విజయపు జెండా ఎగురవేస్తారో గానీ, పోటీ విషయంలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు.

ADVERTISEMENT
Latest Stories