Telugu

ముందుంది ముసళ్ళ పండగ అందరూ రెడీయేనా?

కొన్ని నెలల క్రితం ప్రధాని మోడీ హైదరాబాద్‌ సభలో ప్రసంగిస్తూ, అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ సంక్షోభం ఏర్పడవచ్చని కనుక అందరూ ఖర్చులు తగ్గించుకోవాలని హితవు పలికారు.

కనీసం ఒక ఏడాది పాటు వెండి బంగారు ఆభరణాల కొనుగోలు తగ్గించుకోవాలని, కుదిరితే పూర్తిగా మానుకోవాలన్నారు. అలాగే అనవసరమైన విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. అటువంటి సూచనలు చేసినందుకు ఆయనపై పలువురు విమర్శలు గుప్పించారు.

ADVERTISEMENT

కానీ ప్రధాని మోడీ హెచ్చరించినట్లే ఆ తర్వాత నెలల్లో పెట్రోల్, డీజిల్‌, గ్యాస్ ధరలు.. వాటితో పాటు నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

తాజాగా భారత్‌ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన మరో హెచ్చరిక చాలా ఆందోళన కలిగిస్తుంది. మొన్న సోమవారం న్యూయార్క్ ఆసియా సొసైటీ సమావేశంలో మాట్లాడుతూ, “నిరంతరంగా కొనసాగుతున్న ఈ రెండు యుద్ధాలలో ఇతర దేశాలు జోక్యం చేసుకొని రాజకీయాలు చేస్తుంటే రాబోయే రోజుల్లో ఇవి మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటాయని, అప్పుడు ప్రపంచంలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని జైశంకర్ హెచ్చరించారు.

ఓ పక్క అమెరికా-ఇరాన్‌, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలు కొనసాగుతుండగానే యావత్ ప్రపంచంపై ‘ఎల్‌నినో’ ప్రభావం మొదలైంది. దాంతో భారత్‌తో సహా పలు దేశాలలో అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్లు వాతావరణ మార్పులు జరుగుతున్నాయి.

ఎల్‌నినో ప్రభావంతో పంటలు పండక లేక దిగుబడి గణనీయంగా తగ్గింది. ఆహార ధాన్యాలతో పాటు కూరగాయలు వగైరా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గుతున్నాయి. కానీ డిమాండ్-సప్లై మద్య తేడా నానాటికీ పెరిగిపోతుండటంతో వాటి ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

ఇక ఏఐ కారణంగా ఉద్యోగాలు ఊడి రోడ్డున పడుతున్న కుటుంబాలు, చేతిలో డిగ్రీలున్నా ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులుగా మిగిలిపోతున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ సమస్యని చాలా ప్రభుత్వాలు రాజకీయ కోణంలో నుంచే చూస్తున్నాయి తప్ప దాని పర్యవసానాలు గుర్తించడం లేదు.

ఇలాంటి పరిస్థితులలో విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ఈ హెచ్చరికని కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి అవసరమైన ముందస్తు చర్యలు చేపడతాయో లేదో తెలీదు. కానీ దేశ ప్రజలు మాత్రం దీనిని లైట్ తీసుకోకుండా ఖర్చులు, విలాసాలు తగ్గించుకొని పొదుపు పాటిస్తూ జాగ్రత్త పడటం మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

From Everywhere to Rarely Seen: Sreeleela’s Career Shift

Sreeleela’s career has entered an unusual phase. Not long ago, she was one of the…

33 minutes ago

Karthikeya’s Biggest Rajamouli Inheritance Isn’t Cinema

Karthikeya has grown up around one of Indian cinema’s biggest success stories, but his recent…

1 hour ago